ETV Bharat / city

MLA Dwarampudi: 'జనసేన పార్టీని తాకట్టు పెట్టే పనిలో ఉన్నారు' - ఏపీ రాజకీయ వార్తలు

MLA Dwarampudi: పవన్‌ కల్యాణ్ జనసేన పార్టీని తాకట్టు పెట్టే పనిలో ఉన్నారని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. బల ప్రదర్శన కోసమే పవన్ కల్యాణ్ సభ పెట్టారన్న ఎమ్మెల్యే.. వ్యక్తిగత దూషణలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు.

MLA Dwarampudi
ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
author img

By

Published : Mar 15, 2022, 2:14 PM IST

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి

MLA Dwarampudi: బల ప్రదర్శన కోసమే పవన్ కల్యాణ్ నిన్న సభ పెట్టారని.. వ్యక్తిగత దూషణలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. సినిమాలో నాలుగు డైలాగులు చెప్పేస్తే అది హీరోయిజం కాదని పేర్కొన్నారు. దేశంలో ఎవరైనా హీరో ఉన్నారంటే అది జగన్ ఒక్కరేనని అన్నారు. ఏ కార్యకర్త అయినా పార్టీలో ఉంటూ డబ్బు ఖర్చు చేసేది.. ఏదో ఒక టికెట్ వస్తుందనే అశతోనేనని.. కానీ జనసేన కార్యకర్తలు దేనికోసం ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

జనసేన పార్టీని పవన్​కల్యాణ్​.. తెదేపాకో, భాజపాకో ఎప్పుడు తాకట్టు పెడతారో తెలియదన్నారు. ఎవరివైపు చేరతారో స్పష్టత లేని ఆయన.. అందరికీ నీతులు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తన ఇంటిపై జనసేన కార్యకర్తలు దాడి చేసినందుకే ప్రతిదాడి చేయాల్సి వచ్చిందని వివరించారు. తమ జోలికి వస్తే ఎవరైనా సరే.. సహించేదిలేదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

Amaravathi JAC: 'పవన్​ ప్రసంగం.. ఉద్యమకారుల్లో ధైర్యాన్ని నింపింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.