భౌతికదూరం పాటిస్తూ కరోనా మృతదేహాల అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతి గోవింద ధామం దహనవాటికలో కొవిడ్ మృతదేహాల దహనక్రియలో ఎమ్మెల్యేతో పాటు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరిష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... కరోనా మృతదేహాల అంత్యక్రియల్లో భౌతికదూరం పాటిస్తూ పూర్తి చేయవచ్చని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ...కొవిడ్ మృతదేహాల ఖననం విషయంలో ఏ మాత్రం ఆలస్యం కాకుండా తగిన చర్యలు చేపట్టామని అన్నారు.
ఇదీ చదవండి