ETV Bharat / city

WRONG ROUTE: పోలీస్​ సైరన్​తో రాంగ్​రూట్​లో ఎమ్మెల్యే కాన్వాయ్

సాధారణ ప్రజలు ట్రాఫిక్​ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు వేస్తూ.. ముక్కుపిండి వసూలు చేసే ట్రాఫిక్ పోలీసులు. అదే ఓ ఎమ్మెల్యే కాన్వాయ్​ రాంగ్​రూట్​లో వెళ్తుంటే మాత్రం చూస్తూ మిన్నకుండిపోయారు. పోలీస్​ సైరన్​ మోగిస్తూ కాన్వాయ్​ దర్జాగా రాంగ్​రూట్​లో దూసుకెళ్తుంటే.. ఆపడం కాదు కదా.. కనీసం చలాన్​ కూడా విధించలేకపోయారు. ఇది చూసిన వాహనదారులు పోలీసుల తీరుపై మండిపడుతున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది.

wrong route
పోలీస్​ సైరన్​తో రాంగ్​రూట్​లో ఎమ్మెల్యే కాన్వాయ్
author img

By

Published : Jun 19, 2021, 9:00 PM IST

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని కూకట్​పల్లి భాగ్యనగర్ కాలనీలోని ఏఎస్​రావునగర్​లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి బయలుదేరారు. అల్విన్ కాలనీ ఉషాముళ్లపూడి కమాన్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రారంభోత్సవానికి తొందరగా చేరుకోవాలని పోలీస్​ సైరన్​ మోగిస్తూ ఎమ్మెల్యే కాన్వాయ్​ రాంగ్​రూట్​లో దూసుకెళ్లింది.

అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా ట్రాఫిక్​ నిబంధనలు తుంగలో తొక్కడం ఏంటనిా వాహనదారులు మండిపడ్డారు. సాధారణ పౌరులకు చలాన్లు విధించే పోలీసులే సైరన్ వేస్తూ ఎమ్మెల్యే కాన్వాయ్​ను రాంగ్​రూట్​లో తీసుకెళ్లడం ఏంటని ప్రశ్నించారు. సాధారణ ప్రజలకు వర్తించే ట్రాఫిక్​ నియమాలు అధికారులు, ప్రజాప్రతినిధులకు వర్తించవా అంటూ నిట్టూర్చారు.

ఇదీ చూడండి:

SCHOOLS OPEN: జులై 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభించాలని నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.