ETV Bharat / city

Ring Nets Issue: రింగు వలల సమస్యపై మంత్రుల సమావేశం.. 144 సెక్షన్​ ఎత్తివేస్తూ నిర్ణయం - ministers review on Ring Nets Issue today

Ring Nets Issue: రింగు వలల సమస్యపై మత్స్యకారులు అంతా ఒకే తాటిపైకి రావాలని మంత్రులు సూచించారు. హైకోర్టు విధివిధానాల ప్రకారం వేట చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మత్స్యకార నేతలతో విశాఖ కలెక్టరేట్​లో సమీక్ష నిర్వహించారు. రేపటి నుంచి మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

Ring Nets Issue:
Ring Nets Issue:
author img

By

Published : Jan 9, 2022, 3:43 PM IST

Ring Nets Issue: రింగు వలల సమస్యపై కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి మంత్రులు కన్నబాబు, అప్పలరాజు, అవంతి శ్రీనివాస్​, ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. మత్స్యకార నేతలతో పలు అంశాలపై చర్చించారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చే దిశగా సమాలోచనలు జరిపారు. మత్స్యకార నాయకులు, అధికారులతో ఒక కమిటీ వేసి రింగు వలలు వేట సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయించారు. మరోవైపు రేపటి నుంచి మత్స్యకార గ్రామాల్లో 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ సమస్య కొత్తదేమి కాదు - మంత్రి అప్పలరాజు
రింగు వలల సమస్య కొత్తదేమి కాదన్న మంత్రి అప్పలరాజు.. చేపల వేటలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. చట్టాలు రాసుకున్నప్పుడు ఈ నూతన పద్ధతులు లేవని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాల మేరకు వేట చేసుకోవాలని స్పష్టం చేశారు.

రింగు వలలకు అనుమతి ఇవ్వలేదు - కన్నబాబు
వైకాపా ప్రభుత్వం వచ్చాక రింగు వలలకు అనుమతి ఇవ్వలేదని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతులే ఉన్నాయని.. హైకోర్టు విధివిధానాల ప్రకారం వేట చేసుకోవాలని సూచించారు.

విభేదాలతో నష్టం - మంత్రి అవంతి
సమస్యను పరిష్కరించే దిశగా మత్స్యకారులు చర్యలు తీసుకోవాలని మంత్రి అవంతి కోరారు. విభేదాల కారణంగా నష్టపోయేది కూడా మత్స్యకారులేనని పేర్కొన్నారు.

ఒక్క మాట మీదకు రావాలి - ఎంపీ విజయసాయిరెడ్డి
రింగు వలలు ఉన్నవారి వద్ద సంప్రదాయ వలలు ఉంటాయని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. చిత్తశుద్ధితో సమస్యను పరిష్కారం చేసుకోవాలని చెప్పారు. మత్స్యకార నేతలు మాట్లాడుకుని ఒక్క మాట మీదకు రావాలని కోరారు.

అసలు ఏమిటీ వివాదం... ?
సాధారణంగా మూడు రకాల బోట్లపై చేపల వేట సాగిస్తారు. సంప్రదాయ మత్స్యకారులు తెప్పలు, మరికొందరు ఇంజిను బోట్లు, ఇంకొందరు మరపడవలను ఉపయోగిస్తారు. మరపడవలు తీరం నుంచి 15కిలోమీటర్లు పైబడి, తెప్పలు, ఇంజిను బోట్లు 5 కిలోమీటర్ల పరిధిలో వేట సాగిస్తాయి. జిల్లాలో ఒకప్పుడు 132 రింగు వలలకు అనుమతులు ఇచ్చారు. వీటిలో 52 వలలు విశాఖ చేపల రేవు నుంచి పాయకరావుపేట తీరం వరకు ఉన్నాయి. వారికి లైసెన్సులు ఉన్నప్పటికీ రింగు వలలు వాడడం లేదు. మిగిలిన 80 వలలు ఎండాడ, మంగమారిపేట, భీమిలి మత్స్యకారుల వద్ద ఉన్నాయి. వీటిలో 19 వలలకు మాత్రమే అధికారిక అనుమతులు ఉన్నాయి. లైసెన్సులు ఉన్నవాటి కంటే ఎక్కువగా రింగు వలలను వినియోగిస్తూ ఎండాడ, మంగమారిపేట, భీమిలి మత్స్యకారులు వేట సాగిస్తున్నారనేది ఆరోపణ. వీరిని చినజాలరిపేట, పెద జాలారిపేట మత్స్యకారులు అడ్డుకుంటున్నారు. గత ఏడాది జూన్‌లో తొలిసారి వివాదం చెలరేగింది. అప్పటిలో పోలీసు, రెవెన్యూ, మత్స్యశాఖ అధికారులు జోక్యం చేసుకొని వివాదాన్ని చల్లబర్చారు. కొన్నాళ్ల పాటు వేటను నిషేధించారు. ఆర్డీఓ కోర్టులో ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి బైండోవరు చేశారు.

ఫలించని ప్రజాప్రతినిధుల చర్చలు
గతేడాది జులై నెలలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు గవర్నర్‌ బంగ్లాలో రెండు వర్గాలతో సమావేశమై చర్చలు జరిపినా అవి అంతగా ఫలించలేదు. మళ్లీ ఆగస్టు 28న కలెక్టరేట్‌లో మంత్రి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌, మత్స్యశాఖ కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ఇరువర్గాలను శాంతిపర్చే ప్రయత్నాలు చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని మంత్రి మత్స్యకార వర్గాలకు సూచించి మిన్నకుండిపోయారు. బీ మళ్లీ సెప్టెంబరు నుంచి రింగు వలలతో వేట ప్రారంభమవడంతో పలుమార్లు ఘర్షణలు జరిగాయి. దీంతో వాటిని వేటను నిషేధించాలని కోరుతూ మత్స్యకారులు ధర్నాలు చేశారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బీ నవంబరు 2న జీవీఎంసీ నుంచి కలెక్టరేట్‌ వరకు 28 మత్స్యకార గ్రామాలకు చెందిన వారు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బీ డిసెంబరు నెలలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను కార్యాలయం వద్ద కొంతమంది మత్స్యకారులు ఆందోళనకు దిగారు. మత్స్యశాఖ అధికారులను దాదాపు 12సార్లు కలిసి వినతులు అందజేశారు.

హైకోర్టు ఆదేశాలు ఏం చెబుతున్నాయంటే..
రింగు వలల వివాదం రాష్ట్ర హైకోర్టు వరకు వెళ్లింది. దీనిపై గత ఏడాది మే నెలలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వలలు వినియోగించే ఇంజిను బోట్లు తీరం నుంచి 8 కిలోమీటర్లు దాటి వేట సాగించాలని ఆదేశించింది. కొత్తగా అనుమతులు, పునరుద్ధరణ చేయవద్దని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను పాటించకుండా కొందరు తీరం నుంచి 3కిలోమీటర్ల లోపు రింగు వలలను వినియోగిస్తూ వేట సాగిస్తుండడం వివాదానికి కారణమవుతోంది.

అనుమతులు తప్పనిసరి..
బోట్ల నిర్వాహకులు ఎటువంటి వలలు వాడినా మత్స్యశాఖ అభివృద్ధి అధికారి (ఎఫ్‌డీవో) నుంచి అనుమతులు తీసుకోవాలి. ఆయా వలలను చూపించి నిర్ణీత రుసుమును చెల్లించి లైసెన్సు పొందాలి. ఆరేడేళ్ల క్రితం అనుమతులు ఇచ్చిన రింగు వలలనే ఇప్పుడు వాడుతున్నారు. గత రెండేళ్ల నుంచి కొత్త వాటికి మత్స్యశాఖ అనుమతులు ఇవ్వడం లేదు.

ఇదీ చదవండి

FAMILY SUICIDEనిజామాబాద్‌ వాసుల ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..సూసైడ్ నోట్‌లో ఏముందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.