ETV Bharat / city

'మనబడి నాడు-నేడు' తొలివిడత పనులపై మంత్రి సురేశ్‌ సమీక్ష

మనబడి నాడు-నేడు తొలివిడత పనులపై మంత్రి సురేశ్‌ సమీక్ష చేశారు. ఈ నెల 20లోగా తొలివిడత పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రెండో విడత పనులు జరగాల్సి ఉన్నందున గడువు పెంచబోమని స్పష్టం చేశారు. 14,971 బడుల్లో 82 శాతం పెయింటింగ్ పని పూర్తయిందని అధికారులు మంత్రికి వివరించారు.

మంత్రి సురేశ్‌ సమీక్ష
మంత్రి సురేశ్‌ సమీక్ష
author img

By

Published : Jun 4, 2021, 8:36 PM IST

రాష్ట్రవ్యాప్తంగా మనబడి నాడు-నేడు మొదటి విడత పనులను ఈ నెల 20 తేదీలోగా పూర్తి చేయాలని.. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్(Aadimulapu Suresh) అధికారులను ఆదేశించారు. గడవును పెంచబోమని స్పష్టం చేశారు. రెండో విడత నాడు-నేడు పనుల్ని కూడా ప్రారంభించాల్సి ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మొదటి విడతలోని 14,971 పాఠశాలల్లో 82 శాతం మేర పెయింటింగ్ పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.

నాడు-నేడు పనుల్లో భాగంగా ప్రహరీల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఇకపై జాప్యం జరిగితే కుదరదని హెచ్చరించారు. డెస్క్​లు, నీటి సరఫరా వస్తువులు పాఠశాలలకు చేర్చి.. 100 శాతం పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు కావటంతో పనులు వేగంగా చేసేందుకు ఈ సమయాన్ని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. రెండో విడత నాడు-నేడు పనుల టెండర్ ప్రక్రియ పైనా మంత్రి అధికారులతో సమీక్షించారు.

ఇదీ చదవండీ... జగన్.. టీకాల సరఫరాపై ప్రధానిని ఎందుకు ప్రశ్నించరు..? జైరామ్‌ రమేశ్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.