నాణ్యమైన విద్యను అందించడం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. 'పాఠశాల విద్య - సమగ్ర శిక్షా' కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతులకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఆన్లైన్ ద్వారా శిక్షణను ఆయన ప్రారంభించారు. 24 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. విద్యారంగంలో ఖర్చు చేసే ప్రతి పైసా.. భవిష్యత్తుకు పెట్టుబడిలాంటిదని పేర్కొన్నారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి: వాహనంలో కూర్చునే టీకా.. ఎక్కడంటే?
విభిన్న విద్యా ప్రణాళికలను ఎస్సీఈఆర్టీ క్షుణ్నంగా పరిశీలించి.. ఎన్నో నెలలు కష్టపడి నాణ్యమైన సిలబస్‌ను, పాఠ్య పుస్తకాలను తయారు చేశారని మంత్రి తెలిపారు. రాబోయే కాలంలో ఏడో తరగతి నుంచి సీబీఎస్ఈ విధానం అమలు చేయబోతున్నామని చెప్పారు.
2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్ఈ బోర్డు పరీక్ష రాస్తారు కాబట్టి .. ఆంగ్లంలో బోధించేలా ఉపాధ్యాయులకు మంచి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సెలవుల్లో 50 గంటల ఆన్లైన్ శిక్షణతో కూడిన 24 లైవ్ ఉపన్యాసాలు ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, సమగ్ర శిక్షా పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: