అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమంలో పస లేదని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం వైకాపా కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి... అమరావతిపై వివాదాస్పద వాఖ్యలు చేశారు.
అమరావతిలో కొందరు వీధి నాటకాలు వేస్తూ, షో చేస్తున్నారు. మీడియాలోనే దాన్ని ఉద్యమంగా చూపిస్తున్నారు. 29 గ్రామాలతో మొదలైన ఉద్యమ సెగ.... ఇప్పుడు కేవలం మూడున్నర గ్రామాలకు పరిమితమైంది. అది ఒక రియల్ ఎస్టేట్ ప్రాంతం. అది ఎప్పటికీ ప్రజా రాజధాని కాదు. అసలు అమరావతి రాజధాని ఎక్కడుంది?... చరిత్రలో అమరావతి అనే పేరుకున్న గుర్తింపును చెడగొడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది- సీదిరి అప్పలరాజు, రాష్ట్ర పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి
ఇదీ చదవండి
అమరావతి గ్రామాల్లో ఉద్యమ భేరి...శంకుస్థాపనస్థలికి మహా పాదయాత్ర