తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ కరోనా బారినపడ్డారు. తాజాగా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని నిర్ధరణ అయిందని వైద్యాధికారులు తెలిపారు. నాలుగు రోజులుగా మంత్రి జ్వరంతో బాధపడుతుండగా కొవిడ్ పరీక్ష చేశారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుండగా... మంత్రికి కరోనా నిర్ధరణ కావడం కలకలం రేపింది.
ఇదీ చదవండి: విశాఖలో తెదేపా కార్పొరేటర్ అభ్యర్థిపై దుండగుల దాడి