ETV Bharat / city

'తెదేపా నేతలకు కరోనా వస్తే చెప్పండి.. వైద్యం అందిస్తాం'

కరోనా కట్టడికి ప్రభుత్వం, వైద్యులు, ఇతర సిబ్బంది నిరంతరం కష్టపడుతుంటే ప్రతిపక్షాలు సహకరించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నాయని మంత్రి పేర్ని నాని అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు కరోనా కేసులపై చేసిన ఆరోపణలు దారుణమన్నారు. చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రంలో లక్ష మందికి కరోనా ఉంటే వారిలో తెదేపా నేతలు ఎందరున్నారో చెప్పాలన్నారు. చెప్తే వారికీ చికిత్స అందిస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు.

perni nani
మంత్రి పేర్ని నాని
author img

By

Published : Apr 6, 2020, 8:10 PM IST

మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం

కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరిస్తున్నారని మంత్రి పేర్ని నాని తెలిపారు. మిగతా రాష్ట్రాల కన్నా ముందుగానే రాష్ట్రంలో లాక్​డౌన్ ప్రకటించడం సహ ఉద్యోగులంతా సైనికుల్లా కరోనాపై యుద్ధం చేయడం వల్ల కరోనా వ్యాప్తిని సమర్థంగా నిలువరిస్తున్నామన్నారు. నియోజకవర్గానికి 100 బెడ్ల చొప్పున రాష్ట్రంలో 20వేల క్వారంటైన్ బెడ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. విదేశాల నుంచి వారిని వాలంటీర్లతో సాయంలో గుర్తిస్తున్నామన్నారు. ఇప్పటికే 25 వేల మందిని గుర్తించినట్లు తెలిపారు. రెడ్ జోన్లలోనూ వాలంటీర్లు, పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు విలేకరులు పనిచేస్తున్నారని చెప్పారు.

చంద్రబాబు ఆరోపణలు దారుణం : పేర్ని నాని

ప్రభుత్వం ఇంత చేస్తున్నా ప్రతిపక్షనేత చంద్రబాబు అనవసర విమర్శలు, ఆరోపణలు చేయడం దారుణమని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రస్తుత కష్టకాలంలో చంద్రబాబు బాధ్యత మరచి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో లెక్కకు మించి లక్షల మందికి కరోనా వ్యాపించిందని చంద్రబాబు ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. లక్షల మందికి వైరస్ సోకితే అందులో తెదేపా వారికీ వైరస్ సోకి ఉండాలని, వారి వివరాలు చెబితే వైద్యం చేయిస్తామన్నారు. ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తుంటే అభినందించాల్సిన భాజపా, వామపక్షపార్టీలు ఆరోపణలు చేయటం సరికాదన్నారు.

ఇదీ చదవండి:

'ప్రతి పేద కుటుంబానికి రూ.5వేల సాయం ప్రకటించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.