ప్రభుత్వాసుత్రిలో కొందరు ఉద్యోగులు పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. కాంట్రాక్టు స్వీపర్ల ఉద్యోగ నియామకాలు మొదలుకొని.. విధులలో సైతం అనవసర జోక్యం చేసుకుంటున్నారనే విషయం తన దృష్టికి వచ్చిందని సూచించారు. వారు పద్ధతి మార్చుకోకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని పేర్ని నాని(Perni Nani) హెచ్చరించారు.
మంగళవారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ.. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను మంత్రి కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకొని..చాలా సమస్యలకు మంత్రి పేర్ని నాని అక్కడికక్కడే పరిష్కారం చూపించారు.
ఇదీ చదవండి: