విదేశీ పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముంబయిలో రెండు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ సదస్సు వేదికగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనుంది. సదస్సుకు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సదస్సుకు హాజరై రాష్ట్రంలో పెట్రో రంగాల్లో పెట్టుబడులకు అనువైన అంశాలను వివరించనున్నారు. ఎఫ్ఐసీసీఐ ఆధ్వర్యంలో ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో ఇవాళ, రేపు ఈ కార్యక్రమం జరగనుంది. గ్లోబల్ కెమికల్స్, పెట్రో కెమికల్స్పై జరగనున్న ఈ సమావేశంలో మంత్రి కీలక ప్రసంగం చేయనున్నారు. పెట్రో కెమికల్ రంగంలో భారీగా విదేశీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి