-
Good news for Eastern Hyderabad!@Genpact will be creating 15,000 seats as part of expansion of their campus in Uppal in alignment with our GRID Policy. We will be reaching the 1 lakh employment mark in this part of Hyderabad soon!
— KTR (@KTRTRS) February 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Laying the foundation today for 1.9 Mn campus pic.twitter.com/sPAyb3XG3C
">Good news for Eastern Hyderabad!@Genpact will be creating 15,000 seats as part of expansion of their campus in Uppal in alignment with our GRID Policy. We will be reaching the 1 lakh employment mark in this part of Hyderabad soon!
— KTR (@KTRTRS) February 13, 2022
Laying the foundation today for 1.9 Mn campus pic.twitter.com/sPAyb3XG3CGood news for Eastern Hyderabad!@Genpact will be creating 15,000 seats as part of expansion of their campus in Uppal in alignment with our GRID Policy. We will be reaching the 1 lakh employment mark in this part of Hyderabad soon!
— KTR (@KTRTRS) February 13, 2022
Laying the foundation today for 1.9 Mn campus pic.twitter.com/sPAyb3XG3C
KTR laid foundation stone for Genpact: హైదరాబాద్ నలుదిశలా ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తూర్పు హైదరాబాద్‌లో లక్ష మంది ఉద్యోగులు పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ జెన్‌ప్యాక్ట్.. ఉప్పల్‌లో తన కార్యాలయాన్ని విస్తరించనుంది. సంస్థ విస్తరణకు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. సంస్థ విస్తరణతో ఉద్యోగాల కల్పనకు దోహదపడుతున్నందుకు గాను.. జెన్ప్యాక్ట్కు కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. జెన్ ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే తూర్పు హైదరాబాద్‌లో లక్ష ఉద్యోగాల లక్ష్యానికి సమీపిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ హైదరాబాద్‌కు దీటుగా తూర్పు హైదరాబాద్ ఎదుగుతోందని వెల్లడించారు.
"జెన్ ప్యాక్ట్ సంస్థకు హృదయపూర్వక అభినందనలు. జెన్ ప్యాక్ట్ విస్తరణ పూర్తయితే లక్ష ఉద్యోగాల లక్ష్యానికి సమీపిస్తాం. తూర్పు హైదరాబాద్ అభివృద్ధి కోసం నాగోల్‌లో శిల్పారామం ఏర్పాటు చేశాం. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ ప్రాంతంలోనే ఉంది. ఉప్పల్ నుంచి నారాపల్లి దాకా స్కైవే నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ ఐటీ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు ముందుకొస్తున్నారు. ప్రైవేటు డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుంది." -కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
తూర్పు హైదరాబాద్‌లో ఐటీ పార్కుల నిర్మాణానికి డెవలపర్లు ముందుకొస్తున్నారని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు డెవలపర్లకు ప్రభుత్వం తప్పకుండా మద్దతిస్తుందని భరోసా ఇచ్చారు. జెన్‌ప్యాక్ట్‌ను వరంగల్‌లోనూ విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జెన్‌ప్యాక్ట్ ప్రతినిధులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: CPI Narayana on Union Government: కేసీఆర్‌లా జగన్ కూడా పోరాడాలి -సీపీఐ నారాయణ