ETV Bharat / city

దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం: కేటీఆర్

జమిలి ఎన్నికలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు అప్రమత్తమై సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్​కు సూచించారు.

https://www.etvbharat.com/telugu/andhra-pradesh/city/eluru/a-person-dead-in-eluru-govt-hospital-over-unknown-disease-in-westgodavari-district/ap20201206193837576

author img

By

Published : Dec 6, 2020, 8:27 PM IST

దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని... ఆ దిశగా కేంద్రం ముందుకెళ్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జమిలి ఎన్నికలకు అప్రమత్తమై సిద్ధంగా ఉండాలని పార్టీ క్యాడర్​కు సూచించారు. తెలంగాణ భవన్​లో జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నూతనంగా ఎన్నకైన కార్పొరేటర్లు మంత్రిని కేటీఆర్​ను కలిశారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలపై నిరాశ చెందొద్దని కేటీఆర్ నాయకులతో అన్నారు. గెలుపు ఓటములు సహజమని చెప్పారు. ఎప్పటిలాగే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళదామని సూచించారు. సిట్టింగ్​లకే టికెట్లు ఇచ్చే విషయంలో కొంత ఆలోచన చేయాల్సిందని... అందుకే ఇలాంటి ఫలితం వచ్చిందని అన్నారు.

సిట్టింగ్​లను మార్చిన పార్టీ అభ్యర్థులు గెలిచినట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. మార్చని చోట సిట్టింగ్ కార్పొరేటర్లు చాలామంది ఓడిపోయారని... అక్కడే లెక్క తప్పిందన్నారు. సాధారణ ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు లోపాలు సరిదిద్దుకోవాలని కేటీఆర్ సూచన చేశారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి సారించాలని సంబంధిత నాయకులను కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రయత్నలోపం లేదని... ఎమోషనల్​ ఎలక్షన్ జరిగిందని మంత్రి పేర్కొన్నారు. గెలిచిన కార్పొరేటర్లను మంత్రి అభినందించారు.

ఇదీ చూడండి:

ఏలూరు: అస్వస్థతకు గురైన వారిలో ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.