Minister Karumuri Nageswara Rao: రేషన్‌కు నగదు బదిలీపై సోము వీర్రాజు వ్యాఖ్యలు అర్థరహితమని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పథకం గురించి సోము వీర్రాజు ప్రధాని మోదీని ప్రశ్నించాలన్నారు. 2017లో కేంద్రం తెచ్చిన పథకాన్ని ఏపీలో అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను భాజపానే విమర్శించటం విడ్డూరమని ఎద్దేవా చేశారు.
నగదు బదిలీ విషయంలో ప్రజలపై ఎలాంటి ఒత్తిడీ లేదన్నారు. బలవంతంగా ఎవరిమీదా నగదు బదిలీ అమలు చేసేది లేదని తెలిపారు. కొంతమంది బియ్యం బదులు వేరే ఆహారం తీసుకుంటున్నారన్న మంత్రి.. గ్రామంలో ఎంత మంది ఇష్టపడితే అంతమందికి మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు. కార్డులు పోతాయని ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్‌లో కొత్తగా రేషన్ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: విధిలేక ఒప్పుకున్నాం.. పీఆర్సీపై ఏ ఉద్యోగీ సంతృప్తిగా లేరు: సూర్య నారాయణ