ETV Bharat / city

10,035 సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమలు: కన్నబాబు - agriculture minister kannababu on SEED labs

ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద రాష్ట్రంలో 10,035 సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు రూ.460 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయ, ఉద్యానశాఖల మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఒక్కో సూక్ష్మ ఆహారశుద్ధి పరిశ్రమకు రుణ ఆధారిత రాయితీ కింద రూ.10లక్షల వరకు అందిస్తామని వివరించారు.

minister kannababu
విత్తన సంస్థలపై మంత్రి కన్నబాబు సమీక్ష
author img

By

Published : Jan 9, 2021, 6:53 PM IST

Updated : Jan 10, 2021, 6:32 AM IST

మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో శనివారం ఆహారశుద్ధి విధానం 2020-25పై పరిచయ సదస్సు జరిగింది. కొత్త విధానంలో భాగంగా రూ.2,900 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నామని ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయాలను పెంచడం, పంట కోత తర్వాత వచ్చే నష్టాలను అరికట్టడం దీనిలో ప్రధాన ఉద్దేశాలని కన్నబాబు వివరించారు. ‘అరటి, టమాటా, ఉల్లి, బత్తాయి, మామిడి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, కందుల ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.

ఆహారశుద్ధి రంగంలో హబ్‌లు, యూనిట్లు
*మెగా మాంసం శుద్ధి హబ్‌లు: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో..
* మెగా పాల శుద్ధి (ప్రాసెసింగ్‌) హబ్‌లు: విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరు, పులివెందుల (కడప జిల్లా).
* మత్స్యరంగంలో: నియోజకవర్గ స్థాయిలో 150 ఆక్వాబజార్లు, 23 ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, 10 ప్రాసెసింగ్‌ యూనిట్లు.
* విత్తన శుద్ధి రంగంలో: ఆర్‌బీకే (రైతు భరోసా కేంద్రాల) స్థాయిలో 2000 విత్తన శుద్ధి యూనిట్ల ఏర్పాటు, చిరుధాన్యాల శుద్ధి కోసం.
* క్లస్టర్‌/నియోజకవర్గ స్థాయిలో 50 (ప్రస్తుతం ఉన్నవి 17, కొత్తగా 33) సెకండరీ సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు.

పెట్టుబడి రాయితీ
* సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు 15% వరకు, (గరిష్ఠంగా రూ.20లక్షలు).
* రైతు ఉత్పత్తి సంఘాలకు 35% వరకు, (గరిష్ఠంగా రూ.50లక్షలు).
* బీసీ, మైనారిటీ మహిళలకు 35% వరకు, (గరిష్ఠంగా రూ.50లక్షలు).
* ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 45% వరకు (గరిష్ఠంగా రూ.కోటి).

ఇదీ చదవండి

ప్రభుత్వాన్ని సంప్రదించకుండా స్థానిక ఎన్నికలా..? వైకాపా

Last Updated : Jan 10, 2021, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.