దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అప్రమత్తమైనట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మహారాష్ట్రలో కరోనా మహమ్మారి భారీగా విజృంభిస్తోందన్న మంత్రి.. రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే మాత్రమే బయటకు రావాలని.. విధిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ వ్యాక్సిన్ అందించామని తెలిపారు. 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు వెల్లడించారు. కరోనా నుంచి వ్యాక్సిన్ రక్షణ కల్పిస్తోందని ప్రజలు గమనించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మళ్లీ కరోనా టెస్టులు, వైద్యం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.