ETV Bharat / city

Buggana: " వైకాపా ప్రభుత్వంలో పెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలున్నాయి"

Minister Buggana: వైకాపా ప్రభుత్వంలో పెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారిందని... అప్పులు 8 లక్షల కోట్లకు చేరాయంటూ తెదేపా నేత యనమల చేసిన ఆరోపణలు అవాస్తవాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే అప్పులు అసాధారణంగా పెరిగాయని, వైకాపా హయాంలో ఆర్థిక నిర్వహణ మెరుగుపడిందని చెప్పారు. తెదేపా నేతలు చెప్పే కాకి లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

Minister Buggana
మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి
author img

By

Published : Oct 9, 2022, 2:04 PM IST

Updated : Oct 9, 2022, 2:10 PM IST

Minister Buggana: వైకాపా ప్రభుత్వంలో పెట్టిన ప్రతి రూపాయికీ లెక్కలున్నాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. తెదేపా ప్రభుత్వంలోనే అప్పులు అసాధారణంగా పెరిగాయని, వైకాపా ప్రభుత్వంలో ఆర్థిక నిర్వహణ మెరుగు పడిందన్నారు. ఆర్థిక పరిస్థితి దారణంగా దిగజారిందని అప్పులు 8 లక్షల కోట్లకు చేరిందని తెదేపా నేత యనమల రామకృష్ణుడు చేసిన ఆరోపణలు అవసాస్తవాలని, ఓర్వలేక చేస్తున్నవే అని మండిడ్డారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 8 వేల కోట్లు ఆదాయం తగ్గిందని బుగ్గన అన్నారు. ఓ వైపు వనరులు తగ్గుతున్నా సంక్షేమ పథకాలు ఏవీ ఆపకుండా ప్రజల ఖాతాల్లోకి రూ.57 వేల 512 కోట్లు జమ చేసి ప్రజలను ఆదుకున్నామన్నారు.

తెదేపా పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ఇప్పటి పరిస్థితి పోల్చి చూడాలన్నారు. వైకాపా హయాంలో 2019-22 మధ్య మూడేళ్లలో పబ్లిక్ సెక్టారు యూనిట్లు తీసుకున్న అప్పులతో కలిపి చేసిన అప్పులు 15.5 శాతం మాత్రమే పెరిగాయన్నారు. వేస్ అండ్ మీన్స్​ను రిజర్వు బ్యాంక్ రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించిన సదుపాయమని, ఆయా ప్రభుత్వాల ఆర్థిక అవసరాలను బట్టి ఎన్ని సార్లైనా వేస్ అండ్ మీన్స్​కు వెళ్లవచ్చన్నారు. వైకాపా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే ఎందుకు అనుమతిస్తుందన్నారు. ఓవర్ డ్రాఫ్టు తీసుకోవడం, తిరిగి చెల్లించడం జరుగుతుందని, ఇది అదనపు అప్పు కాదన్నారు.

2018 -19 ఏడాదికి ఒక సారికి రూ.1510 కోట్ల ప్రకారం 144 రోజులు ఓడీ అనుమతి ఇస్తే తెదేపా ప్రభుత్వ హయాంలో రూ.19 వేల 654 కోట్లను 107 రోజులు ఓడీ తీసుకున్నారన్నారు. 2019-20 ఏడాదిలో తమకు ఒక సారికి రూ.1510 కోట్ల ప్రకారం 144 రోజులు అనుమతిస్తే తాము రూ.17 వేల 631 కోట్లు ఓడీగా తీసుకున్నామన్నారు. 2020-21 ఏడాదిలో తమకు ఒకసారికి రూ.2416 కోట్ల ప్రకారం 200 రోజులు అనుమతి చేస్తే తాము రూ.31 వేల 812 కోట్లను 103 రోజులు మాత్రమే తీసుకున్నామన్నారు. తెదేపా నేతలు చెప్పే కాకి లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 9, 2022, 2:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.