కొవిడ్ దృష్ట్యా విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం పండగను సంప్రదాయబద్ధంగా సాదాసీదాగా నిర్వహించేలా నిర్ణయించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉత్సవ నిర్వహణపై అధికారులతో సమీక్షించిన ఆయన... జాతరకు భక్తులు తక్కువ మంది వచ్చేలా అవగాహన కల్పిస్తామని చెప్పారు. తొలేళ్లు, సిరిమానోత్సవం రోజు దూరప్రాంతాల ఆర్టీసీ బస్సులు నిలిపివేస్తామన్నారు. జాతరలో పులి వేషాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిషేధిస్తున్నామని వెల్లడించారు. సిరిమాను జాతర రోజున నగరంలో అన్ని దుకాణాలు మూసివేయిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి