ETV Bharat / city

మృతుల కుటుంబ సభ్యులే ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడారు: బొత్స - ఏపీ లేటెస్ట్​ అప్​డేట్స్​

Botsa on Jangareddygudem incident: జంగారెడ్డిగూడెం నాటుసారా మరణాలపై ఉన్నతస్థాయి విచారణ ఎందుకని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నిచారు. మృతులు కుటుంబసభ్యులే ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడారని వ్యాఖ్యానించారు.

Botsa on Jangareddygudem incident
మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Mar 14, 2022, 2:44 PM IST

Updated : Mar 15, 2022, 7:39 AM IST

Botsa on Jangareddygudem incident: చనిపోయినవారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని చెప్పారు. మృతుల విషయంపై ఉపముఖ్యమంత్రి వెళ్లి చూసి వచ్చారని తెలిపారు. నకిలీ మద్యం అయితే మూకుమ్మడిగా చనిపోతారని... ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉత్పన్నం కాలేదన్నారు. ఎక్కువ మద్యం సేవించడం వల్ల చనిపోయారని.. కుటుంబ సభ్యులు చెప్తున్నారని తెలిపారు.

జంగారెడ్డిగూడెంలో జరిగినవి నకిలీ మద్యం మరణాలు కావని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నకిలీ మద్యం తీసుకుంటే ఒకేసారి అయిదారుగురు ఆసుపత్రుల్లో చేరుతుంటారు. రోశయ్య సీఎంగా, నేను మంత్రిగా ఉన్నప్పుడు కాకినాడలో నకిలీ మద్యం తాగి పలువురు చనిపోయారు. కొందరు చూపు కోల్పోయారు. విజయవాడలోనూ కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందారు. జంగారెడ్డిగూడంలో అలా జరగలేదు కదా...? రెండు నెలల వ్యవధిలో ఇవన్నీ జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్వాపరాలను పరిశీలిస్తోంది. కల్తీ మద్యంతో మృతి చెందారన్న అనుమానం ఉంటే ఫిర్యాదులు ఉండాలి కదా? పోస్టుమార్టం చేయాలి కదా? జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో ఎవరూ మరణించలేదు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ అవసరం లేదు’ అని బొత్స స్పష్టంచేశారు.

ఇదీ చదవండి:

Bro Anil: క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో బ్రదర్‌ అనిల్‌కుమార్‌ వరుస భేటీలు.. ఎందుకోసం..?

Last Updated : Mar 15, 2022, 7:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.