కౌలు కోసం అమరావతి రాజధాని ప్రాంత రైతులు రోడ్డెక్కి గళమెత్తడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు చెల్లించా ల్సిన వార్షిక కౌలు రూ. 158 కోట్ల రూపాయలు... 2 నెలల పింఛను మొత్తం రూ. 9.73 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు పురపాలక శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మొత్తాలు వారి బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయని పేర్కొన్నారు.
మంత్రి మాట్లాడుతూ.. కొన్ని సాంకేతిక సమస్యలు ఉండటంతోనే కౌలు ఇవ్వడం ఆలస్యమైందన్నారు. ప్రతిపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు. పింఛను పెంచి రూ. 5 వేలు ఇద్దామనుకున్నామని.. అయితే కొన్ని కారణాల వలన సాధ్యపడలేదన్నారు. పేదవారికి లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు ఎవరూ అడ్డుకోవద్దని.. సంక్షేమ పథకాలను అడ్డుకుంటే ఎంతటివారైనా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు.
అమరావతి రైతులకు కౌలు బుధవారం రోజునే విడుదల చేశాం. అవి ఈరోజు వారి ఖాతాలో జమవుతాయి. ఈ విషయం తెలుసుకునే ప్రతిపక్షం కావాలనే రైతులను రెచ్చగొట్టింది. కొన్ని సాంకేతిక కారణాల వల్లే కౌలు ఇవ్వడం ఆలస్యమయింది. పింఛను కూడా పెంచి రూ. 5వేలు ఇద్దామనుకున్నాం. అయితే అది కోర్టులో ఉండడం వల్ల సాధ్యపడలేదు. పేదలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలను తెదేపా అడ్డుకుంటోంది.-- బొత్స సత్యనారాయణ, మంత్రి
ఇవీ చదవండి..
రాష్ట్రంలో అమ్మే మద్యం తాగితే 2, 3 ఏళ్లకే హరీ అంటారు: రఘురామకృష్ణరాజు