ప్రజలకు నిత్యావసరాల సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. కరోనా కేసులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే వస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ నివారణకు మున్సిపాలిటీల పరిధిలో ముమ్మర ఏర్పాట్లు చేపడుతామని అన్నారు. పారిశుద్ధ్యం విషయంలో మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించడమే కాక.. వారి కుటుంబ సభ్యుల సమాచారం తెలుసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎక్కువ సంఖ్యలో మొబైల్ రైతు బజార్లు సిద్ధం చేశామని.. సరుకుల కొనుగోలు సమయాన్ని కుదించామని తెలిపారు.
ఇదీ చదవండి: