జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు ఐదు కోట్ల ఆంధ్రుల్ని అవమానించేలా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. పవన్ ఒకటంటే తాము పది అంటామని మంత్రి వ్యాఖ్యానించారు. ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని స్థితిలో జనసేనాని ఉన్నారని.. రాజకీయాల్లో ఆవేశం పనికి రాదని ఎద్దేవా చేశారు. జగన్ కేసుల గురించి మాట్లాడుతున్న పవన్‌పైనా ఆరోపణలు ఉన్నాయని.... అవసరమైతే వాటినీ బయటకు తీయగలమని మంత్రి అన్నారు. వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా పవన్ తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాంస్కృతిక శాఖ తరపున యువజనోత్సవాలు నిర్వహించనున్నట్టు మంత్రి అవంతి వెల్లడించారు. త్వరలోనే నెల్లూరు, కాకినాడ, కడపల్లో ఈ యువజనోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
'జనసేనాని.. వ్యక్తిగత విమర్శలు వద్దు.. గౌరవం కాపాడుకో' - పవన్‌పై మంత్రి అవంతి విమర్శలు
సీఎం జగన్ రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయం అంటూ విశాఖలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. వ్యక్తిగత విమర్శలకు వెళ్లకుండా జనసేనాని తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు.