ఎన్ని అవరోధాలు ఎదురైనా 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి... పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 3 వ నంబర్ స్పిల్ వే గేట్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలవరం పనులను గత ప్రభుత్వం 75 శాతం పూర్తి చేసిందని తెలుగుదేశం నేతలు చెప్పడం సరికాదన్నారు.
ఇదీ చదవండి : ప్రకాశంలో పదోతరగతి బాలుడు ఆత్మహత్య