ETV Bharat / city

పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం స్థానాలు గెలిచాం: మంత్రి అనిల్ - మంత్రి అనిల్ కుమార్ తాజా వార్తలు

పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారులు 81 స్థానాల్లో విజయం సాధించారని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. తెదేపా కేవలం 16 శాతం పంచాయతీలనే గెలుచుకుందని చెప్పారు. సీఎం జగన్ పై నమ్మకంతోనే ప్రజలు ఇంతటీ విజయాన్ని అందించారని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలోనూ మెజార్టీ స్థానాలను గెలిచామన్నారు.

minister anil kumar yadav
minister anil kumar yadav
author img

By

Published : Feb 22, 2021, 7:13 PM IST

పంచాయతీ ఎన్నికల్లో 81 శాతం స్థానాలను వైకాపా గెలిచిందని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన వల్లే పంచాయతీ ఎన్నికల్లో ఈ విజయం సాధ్యమైందన్నారు. నాలుగు దఫాల్లో కలిపి కేవలం 16 శాతం పంచాయతీలను మాత్రమే తెదేపా గెలుచుకుందన్నారు.

చంద్రబాబును సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు చీకొట్టారని మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. కుప్పంలో 8 వార్డులు గెలిచినందుకు సంబరాలు జరుపుకున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. పోలీసులు బాగా పని చేశారని ఎస్​ఈసీ ప్రశంసిస్తుంటే.. చంద్రబాబు మాత్రం పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారన్నారు.

రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడికొండలోనూ 70 శాతం సర్పంచులను వైకాపా కైవసం చేసుకుందన్నారు. సీఎం వైఎస్ జగన్​పై నమ్మకంతో ప్రజలు విజయాన్ని అందించారని, అందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా చంద్రబాబు పనికిరారని రాష్ట్ర ప్రజలు నిర్ణయించారన్నారు. మంత్రుల వల్ల ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకుంటామన్నారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీలోనూ ఇదే ఫలితాలు పునరావృతమవుతాయన్నారు. తెదేపాకు వచ్చిన 16శాతం సీట్లు కూడా సొంతం చేసుకునేలా ముందుకు వెళ్తామన్నారు.

ఇదీ చదవండి

టూల్​ కిట్​ కేసులో ఒక్కరోజు పోలీస్​ కస్టడీకి దిశ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.