ETV Bharat / city

CHIRANJEEVI: బోనం.. తెలంగాణ సంస్కృతికి నిదర్శనం: చిరంజీవి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ నిదర్శనమని సినీనటుడు చిరంజీవి అన్నారు. బోనాలను పురస్కరించుకుని ట్విట్టర్​ ద్వారా ఆయన ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

chiranjeevi wishes for telangana people on occassion of bonalu
బోనం.. తెలంగాణ సంస్కృతికి నిదర్శనమన్న చిరంజీవి
author img

By

Published : Jul 11, 2021, 4:39 PM IST

  • బోనాలపండుగ ప్రారంభం సందర్భంగా ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు.తెలంగాణా సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల ఉత్సవాలు.వర్షాలు బాగా కురవాలని,పాడిపంటలు వృద్ధి చెందాలని,అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఆషాఢ మాసం అంతా జరిగే ఈ ఉత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను pic.twitter.com/6VHLyoRw6R

    — Chiranjeevi Konidela (@KChiruTweets) July 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తెలంగాణలో బోనాల పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా సినీనటుడు, మెగాస్టార్​ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ఆడపడుచులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని మెగాస్టార్​ ట్వీట్​ చేశారు.

రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని ఆయన ఆకాంక్షించారు. పాడిపంటలు వృద్ధి చెందాలని.. అందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్​లో పేర్కొన్నారు. ప్రజలంతా కలిసి ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు చిరంజీవి చెప్పారు.

బోనాల ఉత్సవాలు ప్రారంభం

తెలంగాణలో బోనాల సంబురం షురూ అయింది. ప్రతిఏటా వైభవంగా జరుపుకునే ఆషాఢమాస బోనాలు గోల్కొండ జగదాంబికా ఆలయం నుంచి మొదలయ్యాయి. ఆలయ కమిటీ అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది. ఉత్సవాల సందర్భంగా.. ఆలయాన్ని పూలు, విద్యుద్దీపాలతో సుందరంగా ముస్తాబు చేశారు. నేటి నుంచి వచ్చే నెల 8 తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:

తెలంగాణ: గోల్కొండలో బోనాల సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.