ETV Bharat / city

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు- ఇంధన నిల్వల నూతన విధానం

ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కోసం మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉందని తెలిపారు. నూతన ఎలక్ట్రికల్ వాహనాల విధానంతో హైదరాబాద్​లో పెద్ద ఎత్తున తయారీ యూనిట్లు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలు- ఇంధన నిల్వల నూతన విధానాన్ని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు.

new electrical vehicle policy benefits
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలు
author img

By

Published : Oct 30, 2020, 9:45 PM IST

నూతన ఎలక్ట్రిక్ వాహనాల​ విధానంతో తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రిక్​ హబ్​గా మారుతుందని మంత్రి కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. ఎలక్ట్రికల్ వాహనాల తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, అందుకు భారీగా ప్రోత్సహకాలు ఇస్తోందని అన్నారు. హైదరాబాద్​లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు -ఇంధన నిల్వపై శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. ఈ నూతన విధానాన్ని మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఆవిష్కరించారు.

ఈ విధానానికి నోడల్ ఏజెన్సీగా టీఎస్​జెన్​కో వ్యవహరించనుంది. పదేళ్ల పాటు అమలులో ఉండనుంది. ఈ పాలసీతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగానికి భారీగా ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు మంత్రి కేటీర్ వెల్లడించారు. కొనుగోలుదారులను ప్రోత్సహించడానికి తొలి ఉత్పత్తులకు రిజిస్ట్రేషన్ రుసుము, రహదారి పన్ను నుంచి ప్రభుత్వం పూర్తి మినహాయింపు ఇచ్చింది.

'డీ కార్బనైజేషన్, డిజిటైజేషన్, డీ సెంట్రలైజేషన్ అనే త్రీడీ మంత్ర విధానంతో ముందుకు వెళ్తున్నాం. కాలుష్య కోరల్లోంచి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన భాద్యత మన మీద ఉంది. వాయి కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి సంప్రదాయేతర ఇంధన వనరులతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.'

-కేటీఆర్​, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలకు ప్రభుత్వం భారీగా రాయితీలు ఇస్తోంది. రూ. 200 కోట్ల పెట్టుబడితో వాహనాల తయారీ చేపట్టే పరిశ్రమలకు రూ. 30 కోట్లకు తగ్గకుండా 20 శాతం పెట్టుబడి రాయితీ కల్పిస్తుందని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ తెలిపారు.

ప్రభుత్వం కల్పించే రాయితీలు

  • రూ. 25 కోట్లకు తగ్గకుండా ఏడేళ్లపాటు జీఎస్టీ తిరిగి చెల్లించే అవకాశం
  • ఐదేళ్ల పాటు రూ. 5 కోట్ల పరిమితితో 25 శాతం విద్యుత్ రాయితీ
  • రూ. 5 కోట్లకు తగ్గకుండా ఐదేళ్ల పాటు 60 శాతం రవాణా రుసుము
  • రూ. 5 కోట్లకు తగ్గకుండా 5.25 శాతం వడ్డీ రాయితీలు

'పారిశ్రామిక ప్రాంతాల్లో ఈ వాహనాల తయారీ, ఇంధన నిల్వల కంపెనీలకు ప్రోత్సాహం ఇస్తున్నాం. స్టాంపు బదిలీ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ రుసుముల నుంచి మినహాయింపులు కల్పిస్తున్నాం. ఇటు పరిశ్రమలు ఏర్పాటు చేసే వారితో పాటు కొనుగోలుదారులకు కూడా భారీ ప్రోత్సాహకాలు అందిస్తున్నాం.'

పువ్వాడ అజయ్​ కుమార్​, రవాణా శాఖ మంత్రి

కొనుగోలుదారులకు రాయితీలు

  • తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు వంద శాతం రిజిస్ట్రేషన్ రుసుం, రోడ్డు పన్ను నుంచి మినహాయింపు
  • మొదటి 20 వేల ఆటోలు, 5 వేల ఫోర్​ వీలర్ వాహనాలు, 10 వేల రవాణా వాహనాలు, 5 వేల కార్లు, 500 బస్సులకు వందశాతం రిజిస్ట్రేషన్ రుసుం, రోడ్డు పన్ను మినహాయింపు
  • రాష్ట్రంలో రైతుల కోసం ట్రాక్టర్లకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుము నుంచి 100 శాతం మినహాయింపు
  • పారిశ్రామిక లాజిస్టిక్స్, రవాణా కేంద్రాల పరిధిలో రాత్రి పూట పార్కింగ్, ఛార్జింగ్ సదుపాయాలు
  • ఆటోలకు అదనంగా ఫిట్మెంట్ రాయితీల కింద రూ. 15 వేలకు మించకుండా 15 శాతం రాయితీ

ఛార్జింగ్​ సదుపాయాలు

అంతే కాకుండా హైదరాబాద్​తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో వాహనాలకు ప్రత్యేక ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ ద్వారా ఛార్జింగ్ కేంద్రాలకు ప్రత్యేక ఫీజు వసూలు చేయనున్నారు. టౌన్ షిప్​లలో ఛార్జింగ్ కేంద్రాల స్థాపన, మహా నగరాలకు వెళ్లే జాతీయ రహదారుల పక్కన ప్రతి 50 కిలోమీటర్లకి ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

ఆర్టీసీ, మెట్రో రైల్ సంస్థలు తమ డిపోల దగ్గర ద్విచక్ర వాహనాలకు ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మహీంద్రా అండ్ మహీంద్రా సీఈఓ డాక్టర్​ పవన్ గోయాంకా, ఎస్ బ్యాంకు ఛైర్మన్ సునీల్ మెహతా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

వైకాపా నేత కుమారుడిపై హత్యాయత్నం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.