ETV Bharat / city

APPSC: ఏపీపీఎస్సీ అభ్యర్థులకు 'మెడికల్ బోర్డు' ఏర్పాటు..ప్రభుత్వం ఉత్తర్వులు!

ఏపీపీఎస్సీ(APPSC) నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్​లో ఎంపికైన అభ్యర్ధులతో పాటు వివిధ పరీక్షల్లో ఇంటర్వూకు ఎంపికైన అభ్యర్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

APPSC
APPSC
author img

By

Published : Jun 8, 2021, 10:35 PM IST

Updated : Jun 9, 2021, 1:50 AM IST

ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌- 1 మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్ధులతో పాటు వివిధ పరీక్షల్లో ఇంటర్వూకు ఎంపికైన అభ్యర్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గుంటూరు జీజీహెచ్‌లో ఈ మెడికల్‌ బోర్డు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధుల ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.

వైద్య పరంగా ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులా? కారా? అన్న అంశాన్ని బోర్డు నిర్ధారిస్తుందని స్పష్టం చేసింది. ఈమేరకు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇంటర్వూలకు ఎంపికైన అభ్యర్ధులకు మెడికల్‌ బోర్డు ఆద్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్‌ 17 తేదీ నుంచి జూలై 9 తేదీ వరకూ కమిషన్‌ కార్యాలయంలో ఇంటర్వూలు నిర్వహించాల్సి ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులు కానున్న అభ్యర్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాల్సిందిగా ఏపీపీఎస్సీకి సూచనలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

nv raman: ఇంటర్ విద్యార్థికి శుభాశీస్సులు తెలుపుతూ... సీజేఐ ఎన్వీ రమణ లేఖ

Last Updated : Jun 9, 2021, 1:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.