ETV Bharat / city

తెలంగాణ: మంజీరా తీరాన ఆశోకుడి ఆనవాళ్లు

తెలంగామ మెదక్​ జిల్లా మంజీరా తీరాన మౌర్యుల కాలం నాటి ఆధారాలు లభ్యమయ్యాయి. మృణ్మయ పాత్రపై బ్రహ్మి లిపిలో ప్రాకృత భాషలో ‘దేవానాం’ అనే లేఖనం దొరికింది. ఇది క్రీస్తుపూర్వం మూడో శతాబ్దానికి చెందినదని చరిత్రకారులు చెప్తున్నారు.

mauryan-period-evidence-found-at-manjira-river-in-medak-district
మంజీరా తీరాన ఆశోకుడి ఆనవాళ్లు
author img

By

Published : Nov 25, 2020, 12:55 PM IST

తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా మంజీరా తీరాన మౌర్యుల కాలానికి సంబంధించిన ఆధారాలు వెలుగుచూశాయి. ఇప్పటివరకు చాలాచోట్ల అశోకుడి కాలానికి సంబంధించిన శిలాశాసనాలు గుర్తించారు. భారత్‌తోపాటు అఫ్గనిస్థాన్‌, పాకిస్థాన్‌, నేపాల్‌లలో ఇవి లభ్యమయ్యాయి. తాజాగా మంజీరా తీరాన మృణ్మయ పాత్రపై బ్రహ్మి లిపిలో ప్రాకృత భాషలో ‘దేవానాం’ అనే లేఖనం దొరికింది. తెలంగాణలోనే తొలిసారిగా మెదక్‌ జిల్లా కొల్చారంలో ఇవి దొరకడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది క్రీస్తుపూర్వం మూడో శతాబ్దానికి చెందినది.

అశోకుడి బిరుదు

‘దేవానాం ప్రియం’ అనేది అశోకుడి బిరుదు. దేవతలకు ఇష్టమైనవాడు అని అర్థం. దీనిద్వారా తెలంగాణలో మౌర్యుల కాలం నాటి ఆవాసాలున్నట్లు తేలిందని చరిత్ర, పురాతత్త్వ పరిశోధకులు ఎం.ఏ.శ్రీనివాసన్‌ తెలిపారు. ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలోని శాసనశాస్త్ర విభాగం తమ అన్వేషణలో కనిపెట్టిన అంశాలను ధ్రువీకరించిందని వివరించారు. ఇక్కడ దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో ఆధారాలు దొరికే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

చారిత్రక సంపద దొరికే అవకాశం

శ్రీనివాసన్‌ బృందం కొల్చారం గ్రామానికి 2 కిలోమీటర్ల సమీపంలో ఉన్న ప్రాంతంలో 3 నెలలపాటు అన్వేషణ సాగించింది. ‘దేవానాం’ లేఖనం దొరికిన ప్రాంతానికి కిలోమీటరు దూరంలోని రాతి గుహల్లో తొలుత 3 బౌద్ధ లఘుశాసనాలు లభించాయి. వీటిని ఆధారం చేసుకొని అన్వేషించగా ఈ లేఖనం దొరికిందని శ్రీనివాసన్‌ తెలిపారు. ఇక్కడ తవ్వకాలు చేపడితే గొప్ప చారిత్రక సంపద దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి :

కెనడాలో రాష్ట్ర యువకుడి ఆత్మహత్య: అనంతపురానికి మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.