ETV Bharat / city

'పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా సీఎం చర్యలు..' - వైకాపా పాలనపై తెదేపా వ్యాఖ్యలు

సీఎం జగన్ చర్యలు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సర్పంచ్​ల ఆమోదం లేకుండా 14వ ఆర్థిక సంఘం నిధుల్ని విద్యుత్​ బకాయిలకు వెచ్చించటం దౌర్జన్యం అని ఆరోపించారు.

మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
author img

By

Published : Jul 21, 2021, 4:40 PM IST

పంచాయతీల తీర్మానం, సర్పంచ్​ల ఆమోదం లేకుండా 14వ ఆర్థిక సంఘం నిధుల్ని విద్యుత్​ బకాయిలకు వెచ్చించటం దౌర్జన్యం అని తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పంచాయతీలు సైతం మార్గదర్శకాలు, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయటానికి వీలు లేని నిధుల పట్ల దారుణంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. ఆర్థిక సంఘం నిధులపై ఆశతో ఇప్పటికే అనేక గ్రామాల్లో అందుకు తగ్గట్లు సర్పంచ్​లు పనులు చేసుకుంటే ప్రభుత్వం అక్రమ మార్గంలో నిధుల్ని కొల్లగొట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ చర్యలు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉన్నాయన్నారు.

ధాన్యం బకాయిల కోసం 5నెలలుగా రైతులు ఎదురుచూస్తుంటే మంత్రి అసత్యాలు చెప్తున్నారని మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ఈ నెలాఖరులోగా చెల్లించకుంటే పౌరసరఫరాల శాఖ మంత్రి ఇంటికెళ్లి నిలదీస్తామన్నారు. బకాయిలు ఎక్కువ మొత్తంలో పెండింగ్ ఉన్న ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిలాల్లో రైతులు ఈ నెల 22న అఖిలపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

AP RAINS: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.