![Maoist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-76-25-mavoist-lekha-paderu-ap10082_25072020092428_2507f_1595649268_459.jpg)
విశాఖ మన్యంలో జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు తలపెట్టిన మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారాన్ని విజయవంతం చేయాలని మావోయిస్టు డివిజన్ కార్యదర్శి అరుణ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె పేరిట ఓ లేఖను విడుదల చేశారు. ప్రజాయుద్ధంలో వేలాది మంది అమరులయ్యారని.. వారందర్నీ గుర్తు చేసుకోవాలని కోరారు. రెండు పేజీలు ఉన్న లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.
ఇదీ చదవండి: