ETV Bharat / city

లాక్​డౌన్​, అకాల వర్షాలు: మామిడి పంటకు అపార నష్టాలు

author img

By

Published : May 21, 2021, 10:20 AM IST

వర్షాలు మామిడి రైతులకు నష్టాలు మిగుల్చుతున్నాయి. మరోవైపు లాక్‌డౌన్ కారణంగా ఎగుమతులు తగ్గిపోయాయి. తెలంగాణలో లాక్‌డౌన్‌ సడలింపు 4 గంటలు మాత్రమే ఉండడంతో స్థానికంగా కూడా పెద్దగా అమ్మకాలు సాగడంలేదు.

mango farmers
మామిడి రైతులు

నెలరోజుల్లో ధర టన్నుకు రూ.10,000 దాకా తగ్గిపోయింది. గతేడాది ఇదే సమయంలో టన్ను ధర గరిష్ఠంగా రూ.35 వేల నుంచి 40 వేల దాకా పలికితే ఇప్పుడు రూ.10 వేల నుంచి 25 వేలు మాత్రమే ఉంది. తెలంగాణలో పెద్దదైన గడ్డిఅన్నారం మామిడి మార్కెట్‌కు బుధవారం 15,669 క్వింటాళ్ల మామిడి కాయలను రైతులు అమ్మకానికి తెచ్చారు. ధర రూ.6 వేల నుంచి రూ.30 వేల దాకా పలికింది. కాని ఎక్కువశాతం పంటకు వ్యాపారులు టన్నుకు రూ.12 వేలు మాత్రమే చెల్లించారు. గరిష్ఠ ధర రూ.30 వేలు అని చూపుతున్నా 10 శాతం పంటకు కూడా అంత ఇవ్వడం లేదు. ఒకటీ లేదా రెండు టన్నులకు గరిష్ఠ ధర ఇచ్చి మిగతా 95 శాతానికి పైగా పంటకు రూ.10 వేల నుంచి 20 వేల లోపే చెల్లిస్తున్నారు.

భారీగా పెరిగిన పంట

ఈ ఏడాది పంట మార్కెట్‌కు విరివిగా వస్తోందని మార్కెటింగ్‌శాఖ తెలిపింది. ఉదాహరణకు గతేడాది (2020) మార్చి నుంచి మే 19 వరకూ గడ్డిఅన్నారం మార్కెట్‌కు రైతులు 43,393 టన్నుల మామిడి కాయలను అమ్మకానికి తేగా ఈ ఏడాది అదే కాలవ్యవధిలో ఏకంగా లక్షా 62 వేల టన్నులకు పైగా వచ్చింది. అదనంగా పంట రావడం, లాక్‌డౌన్‌ వల్ల డిమాండు పడిపోవడం వల్ల ధర కూడా టన్నుకు రూ.10 వేలకు పైగా తగ్గిందనేది మార్కెటింగ్‌శాఖ వాదన. కాని చిల్లర మార్కెట్‌లో కిలో రూ.60కి పైగా అమ్ముతున్నారు. గడ్డి అన్నారం మార్కెట్‌ లోపల రైతు నుంచి రూ.10 నుంచి 30 లోపే కిలో కొంటుండగా అదే మార్కెట్‌ బయట పండ్లను కిలో రూ.60కి చిల్లర వ్యాపారులు అమ్ముతుండటం గమనార్హం.

అకాలవర్షాలు, ఈదురు గాలులతో మామిడిపూత, పిందెలు, కాయలు నేలరాలిపోతున్నాయి. వడగండ్ల వర్షాలకు కాయలు నేలరాలుతుండగా, చెట్లపై ఉన్నవాటికీ మచ్చలు వస్తున్నాయి. ఇలా మచ్చలు ఏర్పడిన కాయలను మాగబెడితే లోపల కుళ్లిపోతున్నాయి. నాణ్యత లేదని వాటిని టన్నుకు కనీసం రూ.5 వేలు కూడా ఇవ్వడం లేదు. తెలంగాణలో 3 లక్షల ఎకరాల్లోని మామిడి తోటలకు 12 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అంచనా వేసింది.

మొత్తం 1,389 మంది రైతులకు చెందిన 6,172 ఎకరాల తోటల్లో 33 శాతానికి పైగా పంట నష్టం వాటిల్లింది. ఈ రైతులు రూ. 4.49 కోట్ల విలువైన పంటను కోల్పోయినట్లు ఉద్యానశాఖ ప్రభుత్వానికి ప్రాథమిక అంచనాలతో నివేదిక ఇచ్చింది. మరో 571 మంది రైతుల తోటల్లో నష్టం 33 శాతానికి తక్కువగా ఉండటంతో వారి వివరాలను పరిగణనలోకి తీసుకోలేదు. విపత్తు నిర్వహణ చట్టం కింద 33 శాతానికి పైగా నష్టం ఉంటేనే రైతు నష్టపోయినట్లుగా గుర్తిస్తారు.

డిమాండు లేకనే ధర పతనం

మామిడిపంటపై రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేశాం. అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ పెట్టడం వల్ల తెలంగాణ పంటకు డిమాండు పడిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు జగిత్యాల మార్కెట్‌ నుంచి 12 వేల టన్నులు ఇతర రాష్ట్రాలకు రైళ్లలో పంపారు. తరవాత డిమాండు, ధర పతనమయ్యాయి. ఈ నెల నుంచి నాణ్యమైన పంట మార్కెట్లకు వస్తున్నా ధర లేక రైతులు నష్టపోతున్నారు. ఎన్నో పోషక విలువలున్న మంచి మామిడి పండ్లు కేవలం మే, జూన్‌ నెలల్లోనే ఎక్కువగా దొరుకుతాయి. వీటిని ప్రజలు ఎక్కువగా కొంటే డిమాండు, ధర పెరిగి రైతులకు ఆదాయం వస్తుంది.

-ఎల్‌.వెంకట్రాంరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఉద్యానశాఖ సంచాలకుడు

ధర లేక రూ.లక్షన్నర నష్టపోయా

5 ఎకరాల మామిడితోట ఉంది. గాలులు, వానలకు కాయలు రాలిపోయి బాగా నష్టం వాటిల్లింది. ఇదే పంటను నెల క్రితం టన్ను రూ. 28 వేలకు అమ్మాను. తాజాగా టన్ను రూ. 20 వేలకు అమ్మాల్సి వచ్చింది. 5 ఎకరాలకు రూ.లక్షన్నర నష్టం వచ్చింది. ఈ సీజన్‌లో పూత, కాత బాగా వచ్చినా డిమాండు, ధర లేకపోవడం వల్ల మాకు మిగిలిందేమీ లేదు.

-బి.సత్యనారాయణరెడ్డి, మామిడి రైతు, సాతారం గ్రామం, జగిత్యాల జిల్లా

ఇదీ చూడండి:

స్టెరాయిడ్స్ వాడకం ప్రమాదమే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.