ETV Bharat / city

Woman Murder: సహజీవనం చేసి.. సజీవ దహనం చేశాడు.. - a man set fired a women hyderabad

సహజీవనంలో మనస్పర్దలు తలెత్తడంతో ఓ వ్యక్తి సదరు మహిళపై కిరోసిన్​ పోసి నిప్పంటించాడు. గమనించిన స్థానికులు తలుపులు పగలగొట్టి మంటలను అదుపు చేశారు. ఈ ఘటన హైదరాబాద్​ కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకొంది.

Woman Murder
Woman Murder
author img

By

Published : Dec 23, 2021, 10:22 AM IST

Woman Murder: సహజీవనం చేస్తున్న మహిళతో వివాదాలు తలెత్తడంతో ఆమెపై కిరోసిన్ పోసి.. నిప్పంటిచాడు ఓ వ్యక్తి. ఈ ఘటన హైదరాబాద్​లోని కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలో జరిగింది. కూకట్​పల్లిలోని ప్రకాశ్​నగర్​లో ఓ మహిళ(55).. నాచారం ఈఎస్​ఐ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఆమె భర్త ఇప్పటికే మృతిచెందగా.. కుమార్తెకు వివాహం చేసి.. కుమారుడితో పాటు ఉంటుంది. కొన్ని రోజుల క్రితం జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న వెంకటేష్​ (55) అనే వ్యక్తితో ఆమెకు పరిచయం అయింది. అది కాస్త సహజీవనం వరకు వెళ్లింది.

అనంతరం కొద్దిరోజులకు వెంకటేష్​ ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, చిత్రహింసలకు గురిచేయడంతో.. అతనికి దూరంగా ఉంటోంది. దీని సహించలేని వెంకటేశ్​​.. తనతో కలిసి ఉండాలంటూ వెంటపడేవాడు. బుధవారం సాయంత్రం 8 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చిన వెంకటేష్​.. గొడవకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన వెంకటేశ్​​ ఆమెపై కిరోసిన్​ పోసి నిప్పంటించాడు. దీంతో ఇద్దరికి మంటలు అంటుకోవడంతో అరుపులు వేశారు. గమనించిన స్థానికులు తలుపులు పగలగొట్టి మంటలను ఆర్పేశారు. అప్పటికే తీవ్రగాయాలతో మహిళ మృతిచెందగా.. వెంకటేశ్​ను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరీశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇదీచూడండి: murder case: నెల్లూరులో దారుణం.. వ్యక్తిని పొడిచి చంపిన స్నేహితులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.