పురపాలక ఎన్నికలకు తెరలేచిన నేపథ్యంలో మాచర్ల మున్సిపాలిటీ ఏకగ్రీవమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. గతేడాది మార్చిలో నామినేషన్ల స్వీకరణ సమయంలో ఇక్కడి 31 వార్డులకు కేవలం 60 నామినేషన్లు మాత్రమే వచ్చాయి. అవన్నీ వైకాపా అభ్యర్థులు, వారి డమ్మీలు వేసినవే. వీటిలోనూ సరైన ధ్రువపత్రాలు లేని కారణంగా ఆరింటిని తిరస్కరించారు. ఇప్పుడు డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకుంటే.. అన్ని వార్డులకు వైకాపా అభ్యర్థులు ఒక్కొక్కరు చొప్పున మిగలనున్నారు. అదే జరిగితే మున్సిపాలిటీ పాలకవర్గమంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అవుతుంది. మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలకు, 74 పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి.
ఇదీ చదవండి