ETV Bharat / city

Manchu Vishnu: ఆ భేటీకి నాన్నను రాకుండా కొందరు అడ్డుకున్నారు: మంచు విష్ణు - సీఎం జగన్‌తో మంచు విష్ణు సమావేశం

Manchu Vishnu Meeting With CM : ముఖ్యమంత్రి జగన్‌తో 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎంతో భేటీలో వ్యక్తిగత విషయాలతో పాటు.. సినీ రంగం విషయాలపై కూడా చర్చించామని వెల్లడించారు. ప్రభుత్వంతో సినీ ప్రముఖల భేటీకి సంబంధించి.. నాన్నకు ఆహ్వానం ఉన్నప్పటికీ.. కొందరు రాకుండా చేశారని ఆరోపించారు.

Manchu Vishnu Meeting With CM
ప్రభుత్వ ఆహ్వానం నాన్నకు అందకుండా చేశారు: మంచు విష్ణు
author img

By

Published : Feb 15, 2022, 12:31 PM IST

Updated : Feb 15, 2022, 5:36 PM IST

ప్రభుత్వ ఆహ్వానం నాన్నకు అందకుండా చేశారు: మంచు విష్ణు

Manchu Vishnu Meeting With CM : తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్​తో 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. 'మా' అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత మూడోసారి ముఖ్యమంత్రిలో భేటీ అయినట్లు విష్ణు తెలిపారు. సీఎం జగన్‌తో భేటీ వ్యక్తిగతమని స్పష్టం చేసిన విష్ణు.. ప్రభుత్వం తరఫున నాన్నకు ఆహ్వానం వచ్చినా.. కొందరు అడ్డుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వ్యక్తిగత కారణాలతో సీఎంను కలిశా. సినీ రంగం అంశాలు చర్చకు వచ్చాయి. సీఎంతో చర్చకు వచ్చిన అంశాలపై మరోసారి చెబుతా.తిరుపతిలో స్టూడియో కడతా.. ప్రభుత్వ మద్దతు కోరుతా. శ్రీవిద్యానికేతన్‌ విద్యా సంస్థ యూనివర్సిటీగా మారింది. ఆసియాలోనే ఉత్తమ ఫిల్మ్‌ కోర్సులు, ఫిల్మ్‌ డిగ్రీలు మొదలుపెడతాం.. నటులుగా ప్రతి తెలుగు వ్యక్తి మాకు కావాల్సిన వారే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మాకు రెండు కళ్లు. సినీ పరిశ్రమకు విశాఖలో అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. కార్యాచరణపై ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో చర్చిస్తాం. ఈ సమావేశానికి నాన్నగారితో పాటు, మరో ఇద్దరు ముగ్గురు హీరోలకూ ఆహ్వానం పంపారు. కానీ, ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఆ ఆహ్వానాన్ని నాన్నకు అందకుండా చేశారు. అలా ఎవరు చేశారో మాకు తెలుసు. దీనిపైనా చర్చిస్తా" - మంచు విష్ణు, 'మా' అధ్యక్షుడు

టిఫిన్​ చేసేందుకు వచ్చారు..

ఇటీవల మంత్రి పేర్నినాని తమ ఇంటికి వచ్చి కలిసినప్పుడు కొన్ని మీడియా సంస్థలు అనవసరంగా తప్పుడు ప్రచారం చేశాయని మంచు విష్ణు అసహనం వ్యక్తం చేశారు. ఆయన బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వచ్చారని.. తమ తండ్రి ఫోన్‌చేసి అల్పాహారం తీసుకునేందుకు ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే వచ్చారని స్పష్టం చేశారు. టికెట్‌ రేట్లతో పాటు, చాలా విషయాలు మాట్లాడుకున్నట్టు వివరించారు.

"తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని అభినందిస్తూ ‘థ్యాంక్యూ’ అని ట్వీట్‌ పెట్టా. కానీ, ఆ ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకుని, అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారు. 2+2.. 22 అయిపోదు. జగన్‌ అన్నతో మాట్లాడినవన్నీ వ్యక్తిగత విషయాలు. సినిమా ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడుకున్నాం కానీ, ఈ వేదికగా అవి చెప్పను. మంచు ఫ్యామిలీకి సపోర్ట్‌ లేకపోతే నేను ‘మా’ అధ్యక్షుడిగా గెలిచేవాడినా. నాకు వ్యతిరేకంగా ప్రచారం చేసిన వాళ్లకు కూడా ఈ ఎన్నికలతో జవాబు చెప్పా. ఫిల్మ్‌ ఇండస్ట్రీ అంతా ఒక కుటుంబం. మాలో మాకు సమస్య వస్తే మేమంతా కలిసి మాట్లాడుకుంటాం. ‘మా’ ఎన్నికల్లో వచ్చిన వివాదాల వల్లే నాకు ఆహ్వానం రాలేదనడం అవాస్తవం" - మంచు విష్ణు, 'మా' అధ్యక్షుడు

ఇదీ చదవండి : సీఎం జగన్​తో సినీ ప్రముఖుల భేటీ.. వివరాలు ఇవే

ఇటీవలే సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారంపై జరిగిన ఈ చర్చలో.. పరిశ్రమ తరపున చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

Compensation: ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు అదే సీజన్‌లో పరిహారం: సీఎం జగన్

Last Updated : Feb 15, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.