ETV Bharat / city

పశువులకు కొత్త వైరస్...బెంబేలెత్తిస్తోన్న లంఫీ స్కిన్ - పశువుల కొత్త వైరస్..లంఫీ స్కిన్ బెంబేలెత్తిస్తోంది

ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతుంటే... తెలంగాణలోని వనపర్తి జిల్లా రైతులను లంఫీ స్కిన్ అనే వ్యాధి బెంబేలెత్తిస్తోంది. జిల్లాలోని పెద్దమందడి, కొత్తకోట, పెబ్బేరు లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే చాలా పశువుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతుండటం వల్ల యంత్రాంగం అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండాలని పశువుల పెంపకం దారులను హెచ్చరిస్తోంది.

State of Telangana
లంఫీ స్కిన్ బెంబేలెత్తిస్తోంది
author img

By

Published : May 6, 2020, 9:11 PM IST

ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతుంటే తెలంగాణలోని వనపర్తి జిల్లాలో మాత్రం పశువులకు సోకిన లంఫీ స్కిన్ వ్యాధి... రైతులను బెంబేలెత్తిస్తోంది. పశువుల శరీరంపై కణితులు రావటం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. ఈ వ్యాధి వల్ల పశువుల మరణాల రేటు తక్కువగా ఉన్నా... పాల ఉత్పత్తి సామర్థ్యం క్షీణించడం ప్రమాదకరమైన పరిణామం. అందుకే ఈ వైరస్​ పట్ల రైతులంతా... అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా అధికారులు హెచ్చరిస్తున్నారు.

కాప్రి ఫాక్స్..

కాప్రి ఫాక్స్ జాతికి చెందిన వైరస్ కారణంగా ఈ వ్యాధి పశువులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్ శరీరంలో ప్రవేశించిన 4 నుంచి 10రోజుల్లో లక్షణాలు బయటకు కనిపిస్తాయి. జ్వరం, కళ్లు, ముక్కు, నోటి నుంచి చొంగ కారటం, కాళ్ల వాపు వంటివి ప్రాథమిక లక్షణాలు. 2 నుంచి 5 సెంటీమీటర్ల వ్యాసం కల్గిన గుండ్రని చర్మ కణితులు ఏర్పడతాయి. కణజాలం, కండర కణాలలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. పెద్ద పరిమాణంలో ఏర్పడ్డ కణితులు పగిలి రక్తస్రావం అవుతూ ఉంటుంది. అలాంటి పశువుల ఆరోగ్యం క్షీణిస్తోంది. జీర్ణశక్తి కోల్పోతాయి. గిత్తల్లో వ్యందత్వం ఏర్పడుతుంది. పాలిచ్చే పశువులలో పొదుగు వాపు వచ్చే ప్రమాదం ఉంది. శ్వాసకోశ ఇబ్బందులు కూడా వస్తాయి.

ఒక పశువు నుంచి మరో పశువుకు..

దోమలు, ఈగలు, గోమార్ల వంటి కీటకాలు కుట్టడం ద్వారా వ్యాధి ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాప్తి చెందుతోంది. వ్యాధి సోకిన పశువు లాలాజలం, తాగిన నీరు ద్వారా ఇతర పశువులకు వ్యాధి సంక్రమించే ప్రమాదం సైతం ఉంది. ఇప్పటికే వనపర్తి జిల్లాలో సుమారు మూడువేల పశువులకు ఈ వ్యాధి సోకిందని అంచనా.

మందు లేని వైరస్​..

లంఫీ స్కిన్ వ్యాధికి మందు లేదు. ఇన్ఫెక్షన్లను అరికట్టేందుకు సిప్రాఫ్లానిన్, ఎంరోఫ్లోక్ససిన్, పెన్సిలిన్, పారాసిటమాల్, మొలక్సీకమ్, కార్తిస్తోన్స్, మల్టీ విటమిన్ ఇంజక్షన్లు మొదలైన మందులు ఇస్తారు. నీరసం పోయేందుకు రక్తంలో గ్లూకోజ్ ద్రావణాన్ని ఎక్కిస్తారు. పుండ్లు తగ్గేందుకు గాయాలపై ఈగలు వాలకుండా ఉండేందుకు వేప నూనె రాయాలి. లంఫీ స్కిన్ వ్యాధి సోకకుండా పశువుల పెంపకందార్లు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. పశువైద్య అధికారుల సలహాలు- సూచనలు ఎప్పటికప్పుడు తీసుకోవాలి.

నిపుణులను పిలిపించిన కలెక్టర్​..

వనపర్తి జిల్లాలో ఈ వ్యాధి సోకిందని తెలియగానే జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాష అప్రమత్తమయ్యారు. రాష్ట్రస్థాయి నిపుణులు, పశువైద్య అధికారుల బృందాన్ని జిల్లాకు పిలిపించారు. మంగళవారం జిల్లాలోని పెద్దమందడి, కొత్తకోట, పెబ్బేరు, ఈర్లదిన్నే, సూగురు తదితర ప్రాంతాలలో పర్యటించి పశువులలో వ్యాధి తీవ్రతను, ప్రభావాన్ని పరిశీలించారు. జిల్లాలో పశువులకు ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి: తెరుచుకున్న మద్యం దుకాణాలు.. ఆనందంలో మందుబాబులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.