ETV Bharat / city

ఒడిశా తీరంలో తీవ్ర అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన

ఒడిశాలోని ఉత్తర తీరానికి సమీపంలో దానిని ఆనుకుని ఉన్న ఝార్ఖండ్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు పాటు వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు

low pressure in odissa
ఒడిశాలోని ఉత్తర తీరంలో తీవ్ర అల్పపీడనం
author img

By

Published : Aug 20, 2020, 12:30 PM IST

Updated : Aug 20, 2020, 7:36 PM IST

ఒడిశాలోని ఉత్తర తీరానికి సమీపంలో దానిని ఆనుకుని ఉన్న ఝార్ఖండ్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. రాగల 3 - 4 రోజులలో పశ్చిమ దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగనుంది. ఆగస్టు 23 తేదీన వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో రాగల మూడు రోజులు పాటు వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్ర ,రాయలసీమ, యానాంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రము తెలిపింది.

ఇవీ చదవండి..

శ్రీశైలం జలాశయం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

Last Updated : Aug 20, 2020, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.