పెళ్లికి పెద్దలు ఒప్పకోకపోటంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడలోని పెద్దచెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కోదాడ లక్ష్మీపురం కాలనీకి చెందిన సాయి(20), ఫాతిమా(19) కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి నిరాకరించారు. దీంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కోదాడ పెద్ద చెరువు సమీపంలో పాదరక్షలు వదిలి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో అటుగా వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థిలికి చేరుకున్న పోలీసులు జాలర్ల సహాయంతో మృతదేహాలను బయటకు తీయించారు. మృతుల బంధవులు రోదనలతో పరిసర ప్రాంతాల్లో విషాదం నెలకొంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురువారం వీరిద్దరి అదృశ్యంపై పోలీస్‌స్టేషన్‌లో వారి తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: సాగర తీరంలో.. పెరుగుతున్న అరాచకాలు