ETV Bharat / city

వటపత్రశాయి అలంకరణలో యాదాద్రి నారసింహుడు - yadadri lakshmi narasimha swamy in vatapathra sai incarnation

యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు రోజుకోక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదో రోజు వటపత్రశాయి అలంకరణలో కనువిందు చేశారు.

yadadri
వటపత్రశాయి అలంకరణలో యాదాద్రి నారసింహుడు
author img

By

Published : Mar 19, 2021, 8:46 PM IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదోరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వటపత్రశాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో స్వామి, అమ్మవార్లకు ఉదయం, సాయంత్రం ఆలయ అర్చకులు పల్లకీ సేవ నిర్వహిస్తున్నారు. వజ్రవైఢూర్యాలు, వివిధ రకాల పుష్పాలు, వటపత్రాలతో నయనందకరంగా స్వామి వారిని అలంకరించారు. అనంతరం బాలాలయ తిరువీధుల్లో స్వామి వారిని ఊరేగించారు.

yadadri
వటపత్రశాయి అలంకరణలో యాదాద్రి నారసింహుడు

ఉత్సవాల్లో భాగంగా యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ నెల 21న ఎదుర్కోలు‌, 22న తిరుకల్యాణం, 23న రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు.

ఇదీ చదవండి: 'రాజధాని అమరావతికి స్వచ్ఛందంగానే భూములిచ్చాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.