ETV Bharat / city

జగన్ రెడ్డి రాజ్యం.. నేరగాళ్లకు స్వర్గంలా మారింది : లోకేశ్‌

author img

By

Published : Aug 9, 2022, 4:35 PM IST

నంద్యాలలో పోలీస్ కానిస్టేబుల్ ను రౌడీషీటర్లు హత్య చేయడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి రాజ్యం నేరగాళ్లకు స్వర్గధామంలా తయారైందని మండి పడ్డారు.

nara
nara

Constable murder : జగన్ రెడ్డి రాజ్యం నేరగాళ్ల పాలిట స్వర్గంలా తయారైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పోలీసుల ప్రాణాలకే రక్షణ లేకుంటే.. ఇక ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా డీఎస్పీ ఆఫీసులో ప‌నిచేసే కానిస్టేబుల్ గూడూరు సురేంద్రకుమార్ ను.. ప‌ట్ట‌ణం న‌డిమ‌ధ్య‌లో అంద‌రూ చూస్తుండ‌గానే దారుణంగా హ‌త్య చేశారు రౌడీషీట‌ర్లు. ఈ ఘటనపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. అత్యంత దారుణమైన ఈ హత్య.. రాష్ట్రంలో శాంతిభద్రతల దుస్థితిని తెలియజేస్తోందని ధ్వజమెత్తారు.

కానిస్టేబుల్ ను చంపిన వారు ఎవరో తెలిసినా.. ఇప్పటికీ పోలీసు బాస్ లు పట్టుకోలేదని మండి పడ్డారు. ఒక కాకి చ‌నిపోతే.. సాటి కాకులు అరుస్తూ గోల చేస్తాయన్న లోకేశ్.. ఒక ఖాకీ(పోలీసు)ని చంపేస్తే.. నిందితులైన రౌడీషీట‌ర్లు ఎవ‌రో తెలిసినా ఇప్ప‌టికీ ఖాకీ బాస్‌లు ప‌ట్టుకోలేదంటే.. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు ఎంత ఘోరంగా ఉన్నాయో తేట‌తెల్లం అవుతోందని మండి పడ్డారు. కానిస్టేబుల్ సురేంద్రకుమార్ ను అత్యంత దారుణంగా హత్య చేసిన వారిని వెంటనే పట్టుకొని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు.

కానిస్టేబుల్ ను వెంటాడుతున్న రౌడీ షీటర్లు

ఏం జరిగిందంటే? నంద్యాల జిల్లా కేంద్రంలో రౌడీ షీటర్ల బరితెగింపునకు పరాకాష్టగా నిలిచింది కానిస్టేబుల్ హత్య. రాత్రివేళ ఒంటరిగా బైక్‌పై వెళ్తున్న కానిస్టేబుల్‌ సురేంద్రకుమార్​ను వెంటాడి వేటాడి హత్య చేయడం సంచలనం రేపింది. తప్పించుకునేందుకు పరుగులు తీస్తున్న అతనిపై.. బీరు సీసాలతో దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దారుణ దృశ్యాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఫుటేజీలను పరిశీలిస్తే టెక్కెలోని టాటూ దుకాణం వద్ద ఆదివారం రాత్రి మద్యం తాగుతున్న రౌడీషీటర్లకు కానిస్టేబుల్‌ సురేంద్రకుమార్‌ (35) కనిపించారు. అతనితో వారు గొడవకు దిగారు.

కానిస్టేబుల్ వారితో మాట్లాడుతుండగానే.. తమ వద్ద ఉన్న బీరు సీసాలతో సురేంద్ర తలపై దాడి చేశారు. నిందితులు ఆరుగురు ఉండటంతో వారినుంచి తప్పించుకునేందుకు సురేంద్ర పద్మావతి సర్కిల్‌ వైపు పరుగులు తీశారు. నిందితులు అతడిని వెంటపడి పట్టుకుని పక్కనే ఉన్న ఆటోలో ఎక్కించారు. ఆటోడ్రైవర్‌ను కొట్టి, అతని మెడపై కత్తి పెట్టి పట్టణ శివారులోని చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లారు. తలకు దెబ్బ తగలడంతో అప్పటికే స్పృహ కోల్పోయిన సురేంద్ర గుండెలో.. వీపుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఘటనాస్థలి నుంచే ముగ్గురు పరారుకాగా.. మరో ఇద్దరు పట్టణంలోకి వచ్చి ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని కొట్టి, వారి వాహనాలు తీసుకొని పరారైనట్లు సమాచారం.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.