ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై అభ్యర్థులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఈ చర్చ ప్రారంభం కానుంది. అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలనే డిమాండ్‌ను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు.
డిజిటల్ మూల్యాంకనం అనేక అనుమానాలకు తావిస్తున్నందున.. వాటన్నిటినీ నివృత్తి చేసి సాంకేతికతపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఇప్పటికే లోకేశ్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. భౌతిక మూల్యాంకనం కోసం రూపొందించిన జవాబు పత్రాలను.. డిజిటల్ పద్ధతిలో చేయడం వల్ల అర్హులు నష్టపోయే ప్రమాదం ఉందనే అంశంపై నేడు చర్చ జరగనుంది.
ఇదీ చదవండి: