రెండోదశలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 10 నుంచి రేపు ఉదయం 6 వరకు అమల్లో ఉంటుంది. ఉదయం పది గంటల తర్వాత ప్రయాణికుల వాహనాలపై నియంత్రణ ఉంటుంది. ఇంటర్ స్టేట్‌బస్ సర్వీసులు, ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణాలను అనుమతించరు.
మినహాయింపులు వీరికే..
జాతీయ రహదారుల వెంబడి ఉండే పెట్రోల్ బంకులను లౌక్‌డౌన్ నుంచి మినహాయించారు. మిగతా ప్రాంతాల్లో ఉన్న బంకులు మాత్రం... ఉదయం 6గంటల నుంచి పదిగంటల వరకే తెరిచి ఉంచాలి. వ్యవసాయ, అనుబంధ రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. వైద్యం, ఆస్పత్రులు, ఔషధ దుకాణాల, పెట్రోల్ పంపులు, శీతల గిడ్డంగులకు, బ్యాంకింగ్ రంగం, మీడియాకు మినహాయింపు ఉంటుంది.
అత్యవసర సేవలతో పాటు మరికొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంది. కొవిడ్ నిబంధనలకు లోబడి తయారీ పరిశ్రమలకు అనుమతినిచ్చారు. టెలికాం, ఇంటర్నెట్, సమాచారం, ఐటీ సేవలకు, కనీసం అవసరమైన ఉద్యోగులతో కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇ-కామర్స్, హోం డెలివరీ సేవలకు, నిర్మాణ పనులకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఉంది.
కిక్కిరిసిన మార్కెట్లు
కొనుగోలుదారులతో ఉదయం 6 నుంచే మార్కెట్లు కిటకిటలాడాయి. నిత్యావసర వస్తువుల రవాణాపై ఎటువంటి ఆంక్షలు ఉండబోవని మార్గదర్శకాల్లో పేర్కొంది. పాలు, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తుల సరఫరాకు అనుమతించారు. ఆర్టీసీ కూడా ఉదయం 10 గంటల వరకే బస్సులు నడపనుంది.
ఇదీ చూడండి: