ETV Bharat / city

తొలి విడత పంచాయతీ ఎన్నికలు: ముగిసిన నామినేషన్లు - తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

తొలి విడత పంచాయతీ పోరులో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన ఆదివారం నామినేషన్లు దాఖలు చేసేందుకు భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ప్రక్రియ ముగియాల్సి ఉన్నా.. పలుచోట్ల అర్ధరాత్రి దాటినా నామినేషన్లు స్వీకరించారు. 93 గ్రామపంచాయతీల్లో సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవం కానున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

local-body
local-body
author img

By

Published : Feb 1, 2021, 1:45 PM IST

Updated : Feb 1, 2021, 2:04 PM IST

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

రాష్ట్రంలో తలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. 12 జిల్లాల పరిధిలో 3 వేల 249 గ్రామపంచాయతీలు, 32 వేల 504 వార్డులకు తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి. ఆదివారం రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం మేరకు... రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులకు కలిపి... సర్పంచి స్థానాలకు 22 వేల 191, వార్డు సభ్యుల స్థానాలకు 77 వేల 129 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరిరోజైన ఆదివారం అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. నిర్ణీత సమయం గడిచే సమయానికి లైన్లలో నిల్చున్న వారందరికీ టోకెన్లు ఇచ్చారు. దీంతో పలుచోట్ల అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా నామినేషన్ల స్వీకరణ కొనసాగింది.

కృష్ణా జిల్లాలో విజయవాడ డివిజన్‌ పరిధిలోని 14 మండలాల్లో తొలివిడతకు సంబంధించి మూడో రోజున సర్పంచి స్థానాలకు 871, వార్డు సభ్యుల స్థానాలకు 5 వేల 531 నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజులకు కలిపి సర్పంచి స్థానాలకు 13 వందల 79, వార్డు స్థానాలకు 7 వేల 889 నామినేషన్లు దాఖలయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో మూడ్రోజులకు గానూ.. సర్పంచి స్థానాలకు 1772 మంది, వార్డుసభ్యుల స్థానాలకు 6 వేల 382 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలుచేశారు.

చిత్తూరు జిల్లా ఆఖరి రోజు సర్పంచ్ స్థానానికి 1577, వార్డు సభ్యుల స్థానాలకు 5119 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తమ్మీద జిల్లాలో సర్పంచి పదవుల కోసం 2890 మంది, వార్డుసభ్యులుగా 6821 మంది నామినేషన్లు వేశారు. అనంతపురం జిల్లాలో మూడో రోజు 806 మంది సర్పంచ్ స్థానాలకు, 2 వేల 376 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు వేశారు. మొత్తంగా జిల్లాలో సర్పంచి స్థానాలకు 1351, వార్డు స్థానాలకు 3153 మంది నామపత్రాలు వేశారు.

తొలిదశ ఎన్నికల్లో ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం.. 93 పంచాయతీల్లో సర్పంచి స్థానాలు ఏకగ్రీవం కానున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. కొన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే నామినేషన్‌ పడటంతో ఎన్నిక లాంఛనమే అయింది. వేలం పాటలో అత్యధిక మొత్తం సమకూర్చిన, గ్రామాభివృద్ధికి నిధులిచ్చిన, ప్రత్యర్థులతో రహస్య ఒప్పందం చేసుకున్నవారు పంచాయతీల్లో ఒకే నామినేషన్‌ వేశారు. వారికి పోటీగా మరో నామినేషన్ పడని కారణంగా అవి కూడా ఏకగ్రీవం కాబోతున్నాయి.

ప్రకాశం జిల్లా అద్దంకి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి అధికారులతో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సమావేశం నిర్వహించారు. రెండో విడత నామినేషన్ ఈ నెల రెండవ తేదీ నుంచి ప్రారంభం అవుతున్న క్రమంలో అధికారులు అంతా సిద్ధం కావాలని తగు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు చర్యలు చేపట్టాలన్నారు.

కర్నూలు జిల్లా నంద్యాల మండలం పోలురు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టరు వీర పాండియన్, ఎస్పీ పక్కిరప్ప లు తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పక్రియను పరిశీలించారు.

ఇదీ చదవండి:

సర్పంచికే ఉంటుంది.. చెక్​ 'పవర్'..!

Last Updated : Feb 1, 2021, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.