ఏపీలో గుంటూరు, చిత్తూరు మినహా మిగతా 11 జిల్లాల్లోని 11 రెవెన్యూ డివిజన్లలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాకో డివిజన్ చొప్పున ఎంపిక చేసిన ఎన్నికల సంఘం వీటిలో ఎన్నికల కోసం శనివారం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏయే రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తారనే విషయం శనివారం తెలియనుంది.
ఎన్నికల కమిషనర్ లేఖ రాసినా ఎన్నికల బాధ్యతల నుంచి గుంటూరు, చిత్తూరు కలెక్టర్లను తప్పించకపోవడంతో ఆ రెండు జిల్లాల్లో మొదటి దశ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయడం లేదని సమాచారం. ఎన్నికల నిర్వహణపై శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్లు, జిల్లా పరిషత్తు సీఈవో, జిల్లా పంచాయతీ అధికారులతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలపై హైడ్రామా.. అసలు ఏం జరిగిందంటే..?