మూడు రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలంటూ గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తెదేపా నేతలు ఎడ్లపాడు వెంకట్రావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్.... ప్రజలతో కలిసి దీక్షలో పాల్గొన్నారు. 'మన రాజధాని-మన అమరావతి' అనే నినాదంతో నిరసన చేపట్టారు.
అమరావతిలో నిరసన హోరు
14:43 December 27
3 రాజధానుల ప్రతిపాదనను విరమించుకోవాలంటూ ధర్నా
14:43 December 27
రైతులకు మద్దతుగా తెదేపా,జనసేన, వామపక్షాలు నిరసన దీక్ష
రాజధాని ప్రాంత రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా, జనసేన, వామపక్ష నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. వినుకొండ నియోజకవర్గ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి...రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. మూడు రాజధానులు వద్దు-అమరావతి ముద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రాజధాని రైతులకు తామూ అండగా ఉంటామని స్థానిక రైతులు తెలిపారు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణి మంచిది కాదంటూ హెచ్చరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
13:05 December 27
కన్నీరు పెట్టుకున్న రాజధాని రైతులు
అమరావతి నుంచి రాజధానిని మారిస్తే తమకు చావే దిక్కని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ సమాధులు ఇక్కడే కట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం భూములిచ్చామని.... ఇప్పుడు తమ పొట్టలు కొట్టొద్దని వేడుకున్నారు.
13:05 December 27
గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం అఖిలపక్ష నాయకులు ఆందోళన
రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలకు మద్దతుగా గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం అఖిలపక్ష నాయకులు జనసేన టిడిపి వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష లో పాల్గొన్న రైతులు పార్టీ నాయకులు మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నిర్వహిస్తూ రాజధాని తరలింపు విరమించుకోవాలని జగన్మోహన్రెడ్డికి సూచించారు
13:05 December 27
పెనుమాక కూడలిలో ప్రజలు ఆందోళన
రాజధానిని అమరావతిలోనే కొనసాగించేలా సీఎం జగన్ మనసు మార్చాలంటూ గుంటూరు జిల్లా పెనుమాక రైతులు, మహిళలు దేవుడిని ప్రార్థించారు. పెనుమాక కూడలిలో ప్రజలు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. రాజధాని వికేంద్రీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు..
11:49 December 27
గుంటూరు: పెదకాకాని వద్ద జాతీయ రహదారిపై తెదేపా శ్రేణుల బైఠాయింపు

ఆందోళనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
తెదేపా నేతల అరెస్టు, పెదకాకాని పోలీసుస్టేషన్‌కు తరలింపు
11:49 December 27
అమరావతి: ఎర్రబాలెంలో ఉద్రిక్త పరిస్థితులు

రహదారిపై టైర్లు తగలబెట్టి గ్రామస్థుల నిరసన
రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు
11:30 December 27
రాజధానిలో నిరసనలు...
ఎర్రబాలెంలో....
మంగళగిరి మం. ఎర్రబాలెంలో రైతుల రాస్తారోకో
రహదారిపై బైఠాయించి మహిళలు, రైతుల ఆందోళన
ఉండవల్లిలో....
ఉండవల్లిలో రహదారిపై బైఠాయించి రైతుల నిరసన
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్
పెదకాకానిలో....
రాజధాని రైతులకు మద్దతుగా పెదకాకానిలో మహాధర్నా

రైతులతో పాటు ఆందోళనలో పాల్గొన్న ధూళిపాళ్ల నరేంద్ర
11:30 December 27
మందడంలో పోలీసు పహారా
మందడంలో పోలీసు పహారా
పూర్తి దిగ్బంధంలోనే మందడం గ్రామం
రహదారిపైకి రానీయకుండా అడ్డుకున్న పోలీసులు
వీధిలోనే బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు
11:30 December 27
గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి ర్యాలీగా బయల్దేరిన అమరావతి పరిరక్షణ కమిటీ

ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే గిరిధర్
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని గంగిరెద్దుతో ప్రదర్శన
గంగిరెద్దు మెడలో ప్లకార్డులు తగిలించి తీసుకెళ్తున్న పరిరక్షణ సమితి నాయకులు
11:13 December 27
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో భారీ నిరసన
రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి నిరసన చేపట్టింది. మూడు రాజధానులు వద్దు-అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
10:17 December 27
10 వ రోజు కొనసాగుతున్న రాజధాని వాసుల ఆందోళనలు
రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదికపై మంత్రి వర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్న తరుణంలో అమరావతిలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. రాజధానిని ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ 10వ రోజున కూడా ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. తుళ్లూరు మండల కేంద్రంలో రైతులు మహాధర్నా కొనసాగిస్తున్నారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహిస్తున్నారు. త్రివర్గ సమావేశం తర్వాత ఆందోళనలు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ భారీగా బలగాలను మోహరించారు.
10:16 December 27
మంత్రివర్గం సమావేశం దృష్ట్యా విజయవాడలో ట్రాఫిక్ నిలిపివేత
మంత్రివర్గం సమావేశం దృష్ట్యా విజయవాడలో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెళ్లే దారిలో... వాహనాలు నిలిచిపోయాయి. కేబినెట్ భద్రత పేరిట వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాహనాల నిలిపివేతపై సాధారణ పౌరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు
10:16 December 27
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్ష
అమరావతికి మద్దతుగా చేపట్టిన మౌనదీక్షను... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరమించారు. ఉదయం 8 గంటలకు ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో... పవిత్ర నీరు, మట్టి ఉంచిన ప్రాంతానికి నమస్కరించి కన్నా దీక్షలో కూర్చున్నారు. 2 గంటల పాటు దీక్ష చేసిన ఆయన... 10 గంటలకు విరమించారు.
10:15 December 27
మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన టీఎన్ఎస్ఎఫ్
రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా... టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం... విజయవాడలోని మంత్రి ఇంటిని ముట్టడించారు. బొత్స కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బ్రహ్మంతో పాటు ఆందోళనకారులను పోలీసులు అడ్డగించారు. అదుపులోకి తీసుకొని సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌కి తరలించారు.
09:23 December 27
ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లే అన్ని దారులను బారికేడ్లతో మూసివేసిన పోలీసులు

ప్రకాశం బ్యారేజీపై ప్రభుత్వ ఉద్యోగులు సహా అందరికి అనుమతి నిరాకరణ
09:23 December 27
అమరావతికి మద్దతుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌనదీక్ష

ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మౌనదీక్ష
పవిత్ర నీరు, మట్టి ఉంచిన ప్రాంతానికి నమస్కరించి దీక్షలో కూర్చున్న కన్నా
కన్నా లక్ష్మీనారాయణతో పాటు దీక్షలో పాల్గొన్న భాజపా నేతలు
ఉదయం 10 గంటలకు మౌనదీక్ష విరమించనున్న కన్నా లక్ష్మీనారాయణ
08:46 December 27
తుళ్లూరులో రాజధాని రైతుల ఆందోళన
తుళ్లూరులో రాజధాని రైతుల ఆందోళన
రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తున్న రైతులు
రహదారిపైనే వంటావార్పు నిర్వహిస్తున్న రైతులు
08:46 December 27
తుళ్లూరు మండలం పెదపరిమిలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ బస్సు అద్దాలు ధ్వంసం

గుంటూరు నుంచి ఎస్‌ఆర్‌ఎం వర్సిటీకి వెళ్తున్న బస్సును అడ్డగించిన రైతులు
08:46 December 27
మంగళగిరి మండలం నిడమర్రులో రైతుల ఆందోళన

భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయాలని డిమాండ్
08:27 December 27
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విజయవాడలో వాకర్స్ ర్యాలీ
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ విజయవాడలో వాకర్స్ ర్యాలీ నిర్వహించారు. లయోలా కళాశాల నుంచి బెంజ్ సర్కిల్ వరకు వాకర్స్ ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున మహిళలు, వృద్ధులు పాల్గొన్నారు.
08:27 December 27
పోలీసు ఆంక్షలపై మండిపడుతున్న రైతులు
అమరావతిలో పోలీసుల ఆంక్షలపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రవాదులను చూసినట్లు తమను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని స్థానికులు మండిపడ్డారు. ఇంటింటికి తిరిగి పోలీసులు హెచ్చరించడంపై తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిత్యవసరాలు తెచ్చుకోకుండా ఆంక్షలు విధిస్తున్నారన్నారు.
07:22 December 27
పదో రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు
రాజధాని రైతుల ఆందోళనలు పదో రోజుకు చేరాయి. ప్రతి గ్రామ కూడలిలో ముళ్ల కంచెలు సిద్ధం చేశారు పోలీసులు. సచివాలయం పరిసర గ్రామాల్లో పెద్దఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. మందడం, మల్కాపురం జంక్షన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తుపాకులు, లాఠీలతో బస్సుల్లో పెద్దఎత్తున బలగాలు దిగాయి. సచివాలయానికి వెళ్లే మార్గంలో టియర్ గ్యాస్, వాటర్ క్యాన్, అగ్నిమాపక దళాలు ఉన్నాయి. గ్రామాల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో మందడం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పదో రోజూ రహదారిపై మహాధర్నా కొనసాగించాలని రైతుల నిర్ణయించారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. ఉద్దండరాయినిపాలెం శంకుస్థాపన ప్రదేశంలో ఉదయం నుంచి రైతులు నిరసన తెలపనున్నారు.కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనలు కొనసాగించనున్నాయి.
07:19 December 27
తుళ్లూరులో శాంతియుత నిరసనకు పోలీసుల అనుమతి

తుళ్లూరులో నిరసన ప్రదేశానికి చేరుకుంటున్న పోలీసులు
07:19 December 27
రాజధాని గ్రామాల్లో కొనసాగుతున్న ఆందోళనలు

ముందస్తు జాగ్రత్తగా భారీగా మోహరించిన పోలీసులు
06:43 December 27
అమరావతిలో రైతుల ఆందోళనలు
మందడం ధర్నాకు అనుమతి ఇవ్వలేదు: తుళ్లూరు డీఎస్పీ
మంత్రివర్గ సమావేశం దృష్ట్యా రాజధాని గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 700 మంది పోలీసులను తుళ్లూరు పరిధిలో మోహరించారు. ప్రతి గ్రామంలోనూ పికటింగ్ ఏర్పాటు చేశారు. మందడంలో మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మంత్రులు, సీఎం వెళ్లే మార్గంలో భారీగా పోలీసుల మోహరించారు.మందడంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి నిరాకరించినట్లు తుళ్లూరు డీఎస్పీ తెలిపారు. కేవలం పాలు, మందులు దుకాణాలకు మాత్రమే అనుమతిచ్చారు

LIVE
Conclusion:
TAGGED:
అమరావతిలో రైతుల ఆందోళనలు