ETV Bharat / city

Telangana Liquor Sales in 2021: వామ్మో... డిసెంబర్​ 31న తెగ తాగేశారుగా..! - ap latest news

Telangana Liquor Sales in 2021 : తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్ముడుపోయింది. 2021 జనవరి నుంచి డిసెంబరు వరకు రూ.30వేల కోట్లకుపైగా విలువైన 3.69 కోట్ల కేసులు లిక్కర్‌, 3.26కోట్లు కేసుల బీరు విక్రయాలు జరిగాయి. డిసెంబరు ఒక్క నెలలోనే దాదాపు రూ.3,500 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోయి సరికొత్త రికార్డు నమోదైంది. డిసెంబర్​ 31 ఒక్క రోజునే దాదాపు రూ.172 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు.

Telangana Liquor Sales in 2021
Telangana Liquor Sales in 2021
author img

By

Published : Jan 1, 2022, 1:28 PM IST

Telangana Liquor Sales in 2021: తెలంగాణ రాష్ట్రంలో 2021లో మద్యం అమ్మకాల జోరు పరంపర కొనసాగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి 2021 సంవత్సరం విక్రయాలు అత్యధికమని చెప్పొచ్చు. 2021లో అంతకుముందు ఏడాది కంటే దాదాపు రూ.కోట్లకుపైగా అధికంగా మద్యం అమ్మకాలు జరగడం సరికొత్త రికార్డు.

2021లోనే అత్యధికం..

Liquor Sales in telangana 2021 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2016లో రూ.14,075 కోట్ల విలువైన 2.72 కోట్ల కేసుల లిక్కర్‌, 3.42 కోట్ల కేసుల బీరు అమ్ముడు పోయింది. 2020 సంవత్సరంలో తీసుకుంటే రూ.25,601.39 కోట్ల విలువైన 3.18 కోట్ల కేసులు లిక్కర్‌, 2.93 కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. అదే 2021 సంవత్సరంలో తీసుకుంటే 30,222 కోట్ల విలువైన 3.69 కోట్ల కేసుల లిక్కర్‌, 3.26కోట్ల కేసుల బీరు విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే గత సంవత్సరం కంటే 4,621 కోట్లు విలువైన మద్యం ఎక్కువ అమ్ముడుపోయింది.

ఆ జిల్లాల్లో అత్యధిక విక్రయాలు..

Liquor Sales in December 2021: కరోనా ప్రభావం దాదాపు అన్ని వ్యవస్థల మీద పడినా తెలంగాణ అబ్కారీ శాఖ మీద మాత్రం పడలేదు. 2021 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన మద్యం విక్రయాలను పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.7673 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరగగా నల్గొండ జిల్లాలో రూ. 3,289 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. హైదరాబాద్​లో రూ. 3208 కోట్లు, ఆదిలాబాద్, నిజామాబాద్​లు మినహా అన్ని జిల్లాల్లో రెండువేల కోట్లకు తక్కువ కాకుండా రెండున్నర వేల కోట్ల విలువైన మద్యం అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

డిసెంబర్​ 31 రికార్డ్..

Liquor Sales in December 31st 2021 : ఇక డిసెంబర్ నెలలో తీసుకుంటే ఈ నెలలో గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా రూ. 3,459 కోట్ల విలువైన 40.48 లక్షల కేసులు లిక్కర్, 34 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయింది. ఇక డిసెంబర్ చివరి రోజు 31 తేదీన ఒక్కరోజులో రూ.172 కోట్లు విలువైన 1.76 లక్షల కేసులు లిక్కర్, 1.66 లక్షల కేసులు బీరు అమ్మకాలు జరిగాయి. అత్యధికంగా రూ.42.26 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోగా వరంగల్ లో రూ. 24.78 కోట్లు, హైదరాబాద్ లో 23.13 కోట్లు విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.

సాఫ్ట్​వేర్ సంస్థలు, ఇతర బహుళజాతి సంస్థలకు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తుండడంతో బీరు విక్రయాలు పడిపోయాయని అబ్కారీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

Liquor Sales: ఏరులై పారిన మద్యం.. నిన్న ఒక్కరోజే ఎన్ని కోట్ల అమ్మకాలంటే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.