ETV Bharat / city

తెలంగాణలో మళ్లీ లాక్​డౌన్​ అంటూ ప్రచారం... మందుబాబుల అలెర్ట్​..

తెలంగాణలో కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతున్నందున.. తిరిగి లాక్‌డౌన్‌ ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం వల్ల మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. సోమవారం ఒక్కరోజే రూ.185 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోయింది. లాక్‌డౌన్‌ పెడితే మద్యం దొరకదని భావిస్తున్న మద్యం ప్రియులు పెద్ద మొత్తంలో లిక్కర్​ కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు.

తెలంగాణలో మళ్లీ లాక్​డౌన్​ అంటూ ప్రచారం... సర్దుకుంటున్న మందుబాబులు...

author img

By

Published : Jun 30, 2020, 12:55 PM IST

Updated : Jun 30, 2020, 2:27 PM IST

తెలంగాణలో వారంరోజులుగా కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతోంది. గ్రేటర్‌ హైదరాబాద్​లో మరింత ప్రమాదకరంగా మారింది. కొవిడ్‌ నివారణ విధులు నిర్వహిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకే కాకుండా తాజాగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు వైరస్​ సోకుతోంది. కొవిడ్​ కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఏకంగా రూ.2,226 కోట్లు..

గ్రేటర్​ హైదరాబాద్​లో లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ఏలా ఉంటుందోనని తెలంగాణ సీఎం కేసీఆర్​ ఉన్నతాధికారులతో చర్చించారు. లాక్​డౌన్​ విధించాలని వైద్య శాఖ అధికారులు కోరడం వల్ల ఏ క్షణానైనా లాక్‌డౌన్‌ ప్రకటించొచ్చని భావించిన మద్యం ప్రియులు పెద్ద మొత్తంలో లిక్కర్​ కొనుగోలు చేసి దాస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాల ద్వారా... 29 రోజులకు ఏకంగా రూ.2,226 కోట్లు విలువైన 26.29లక్షల కేసుల లిక్కర్‌, 27.30లక్షల కేసులు బీరు అమ్ముడు పోయింది.

ఒక్కరోజే రూ.185 కోట్లు

రోజుకు సగటున 70 నుంచి 80 కోట్లు విలువైన మద్యం అమ్ముడుపోతుండగా... సోమవారం ఏకంగా రూ.185 కోట్లు విలువైన మద్యం అమ్ముడయింది. అంటే... రెట్టింపునకు మించి విక్రయాలు జరిగాయి. అత్యధికంగా రూ. 42 కోట్లు రాబడితో రంగారెడ్డి ఎక్సైజ్‌ జిల్లా ముందంజలో ఉంది.

మిగిలిన జిల్లాల్లో జరిగిన విక్రయాలు పరిశీలిస్తే... హైదరాబాద్‌లో రూ.21కోట్లు, నల్గొండ రూ.18.45కోట్లు, కరీంనగర్‌ రూ.16కోట్లు, వరంగల్‌ రూ.15.44కోట్లు, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలు రూ.12కోట్లకు మించాయి. సోమవారం ఒక్క రోజే రూ.185 కోట్లు విలువైన మద్యం అమ్ముడు పోయింది.

ఇదీ చదవండి: 59 చైనా యాప్​లపై నిషేధం

Last Updated : Jun 30, 2020, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.