ETV Bharat / city

పగలు సహజ కళ.. రాత్రి వెలుగుల్లో భళా!

తెలంగాణలోని యాదాద్రిని మహా దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దే పనులు జరుగుతున్నాయి. పగలు సహజంగానే కళ ఉట్టిపడే శిల్పాలు.. రాత్రి వేళలో విద్యుత్​ కాంతుల్లో వెలిగిపోతున్నాయి. మరో తిరుమలగా విఖ్యాతి గాంచాలని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్​ ఆదేశించగా... ఆ దిశగా కొన్ని సంస్థలు లైటింగ్​ ప్రజెంటేషన్​ చేపట్టాయి.

lighting at yadadri temple
విద్యుత్ కాంతుల్లో యాదాద్రి ఆలయం
author img

By

Published : Jul 5, 2020, 1:06 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి పంచ నారసింహుల క్షేత్రాన్ని మహా దివ్యంగా తీర్చిదిద్దే పనులు యాడా ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. కృష్ణ శిలతో రూపొందించిన యాదాద్రీషుడి ఆలయం మరో తిరుమలగా విఖ్యాతి గాంచనుంది. ఆ స్థాయికి తగ్గట్లు ప్రత్యేక విద్యుదీకరణ జరపాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఆ మేరకు సీఎంవో భూపాల్ రెడ్డి, యాడా వైస్ ఛైర్మన్ కిషన్ రావు సూచనలతో పేరొందిన సంస్థలు లైటింగ్ ప్రజెంటేషన్ చేపట్టాయి. భక్తి భావాన్ని పెంచే శిల్ప కళా రూపాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతుల్లో రాత్రి వేళల్లోనూ సహజత్వం ఉట్టిపడేలా కనిపిస్తున్నాయని జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న ఆలయ శిల్పి ఆనంద్ సాయి తెలిపారు.

ఇవీ చూడండి: సాగు"బడి": కరోనాతో వ్యవసాయ క్షేత్రాల్లో సరికొత్త పాఠాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.