ETV Bharat / city

LIC: విజయవాడలో ఎల్‌ఐసీ ఉద్యోగుల మహాసభలు - vijayawada updates

ఎల్‌ఐసీ ఉద్యోగులు సంస్థను కాపాడుకుంటూనే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సహకారంతో ఉద్యమించాలని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను దూకుడుగా అమలు చేస్తోందని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టదాయకమని తెలిపారు.

LIC Employees General Assemblies
ఎల్‌ఐసీ ఉద్యోగుల మహాసభలు
author img

By

Published : Aug 22, 2021, 9:16 AM IST

దేశ ఆర్థిక స్వావలంబనలో ఎల్‌ఐసీది కీలకపాత్ర అని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు పేర్కొన్నారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో శనివారం ఎల్‌ఐసీ ఉద్యోగుల సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ మహాసభలు ప్రారంభమయ్యాయి. యూనియన్‌ పతాకాన్ని జోనల్‌ ఫెడరేషన్‌ ఉపాధ్యక్షులు పి.సతీష్‌, ఎస్‌కే గీత ఆవిష్కరించారు. మహాసభలకు ఎండీ మొహబూబ్‌ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను దూకుడుగా అమలు చేస్తోందని, ఇది మన ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టదాయకమని తెలిపారు. ఉద్యోగులు సంస్థను కాపాడుకుంటూనే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజల సహకారంతో ఉద్యమించాలని సూచించారు.

జోనల్‌ ఫెడరేషన్‌ 12వ మహాసభలను ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదాలు చేస్తున్న కేంద్రం.. ప్రభుత్వ రంగ బీమా సంస్థలు, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లను ప్రైవేటీకరించడానికి సిద్ధమవడం సరైన ఆర్థిక విధానం కాదని తెలిపారు. ఎల్‌ఐసీ ఐపీవోను చేపట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతమని వ్యాఖ్యానించారు. యూనియన్‌ జాతీయ అధ్యక్షుడు వి.రమేష్‌, జాతీయ సహాయ కార్యదర్శి కేవీవీఎస్‌ఎన్‌ రాజు, కోశాధికారి బీఎస్‌ రవి, మాజీ జాతీయ అధ్యక్షుడు అమానుల్లాఖాన్‌, మాజీ ప్రధాన కార్యదర్శి కె.వేణుగోపాల్‌, సహాయ కోశాధికారి కేఎస్‌ రాజశేఖర్‌, జోనల్‌, డివిజన్‌ నాయకులు, మచిలీపట్నం డివిజన్‌ అధ్యక్షుడు జె.సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి కిషోర్‌ కుమార్‌, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. మహాసభల ప్రారంభానికి ముందు ఇటీవల కన్నుమూసిన జోనల్‌ అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రావు, కెమ్లెంట్‌ గ్జేవియర్‌ దాస్‌, ఇతర ఉద్యోగులకు అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

ఇదీ చదవండీ.. TIDCO houses : అప్పెప్పుడు పుట్టాలి.. ఇళ్లెప్పుడు కట్టాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.