అవినీతిని ప్రశ్నిస్తే కేసులు, ఎదిరిస్తే సంకెళ్లు అనే రీతిలో సీఎం జగన్ పాలన సాగుతోంది. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఆనందయ్య మందు పంపిణీలో ప్రభుత్వ పెద్దలు ఎలా జోక్యం చేసుకుంటారు. మందును సొమ్ము చేసుకునేందుకే అధికారపార్టీ నేతలు పాట్లు పడుతున్నారు. ఆనందయ్య మందు పంపిణీపై వెబ్ సైట్ తయారు చేసి కోట్లు కొల్లగొట్టేందుకు యత్నించిన శేశ్రిత సంస్థ అధినేత నర్మదరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకొలేదు? దీనిపై ప్రశ్నించిన ప్రశ్నించిన సోమిరెడ్డిపై కేసు పెడతారా? సంగం డెయిరీని నిర్వీర్యం చేసి అమూల్ కు అప్పగించే కుట్రలో భాగంగానే ధూళిపాళ్ల నరేంద్రపైనా మరో తప్పుడు కేసు పెట్టారు. విశాఖపట్నంలో మానసిక వికలాంగుల సంస్థ స్థలాన్ని వైకాపా నేతలు కబ్జా చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందనటానికి ఈ సంఘటనలన్నీ ఉదాహరణలే. విధ్వంసకర పాలనపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది."
-శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు
ప్రజల ప్రాణాలు కాపాడే ఆనందయ్య మందులోనూ వైకాపా నేతల అవినీతికి యత్నిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తే సోమిరెడ్డిపై కేసు పెట్టడమేంటి? "మందును ఆన్లైన్లో విక్రయించటానికి యత్నించిన నర్మదరెడ్డి.. వైకాపా ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి ప్రమేయం లేకుండానే వెబ్సైట్ ప్రారంభించారా? ప్రభుత్వానికి, శ్రేశిత టెక్నాలజీస్‌కు సంబంధం ఏమిటి? సోమిరెడ్డి, ధూళిపాళ్ల నరేంద్రపై పెట్టిన తప్పుడు కేసుల్ని వెంటనే ఎత్తివేయాలి."
- తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప
ఇదీ చదవండీ.. విద్యార్థుల ప్రాణాలకు పరీక్ష పెట్టేలా రివర్స్ నిర్ణయాలు: అనగాని