Alprazolam Case in LB nagar court: నిషేధిత ఆల్ప్రాజోలం తయారు చేసిన వ్యక్తికి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కోర్టు జైలు శిక్ష విధించింది. జీడిమెట్ల రసాయన పరిశ్రమలో ఆల్ఫ్రాజోలం తయారు చేసిన రాధాకృష్ణకు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. లక్ష జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 2016 లో అతడిపై కేసు నమోదు కాగా.. బెయిల్పై బయటకు వచ్చిన రాధాకృష్ణ.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలెజిన్స్(డీఆర్ఐ) సాక్ష్యాధారాల ద్వారా దోషిగా తేలడంతో శిక్షతో పాటు జరిమానా విధించింది.
రాధాకృష్ణా ఆల్ప్రాజోలం తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు జీడీమెట్ల రసాయన పరిశ్రమపై 2016 జూన్ 13న దాడి చేశారు. 19 కిలోల ఆల్ఫ్రాజోలంతో పాటు 218 కిలోల ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాధాకృష్ణపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆ తర్వాత రాధాకృష్ణ బెయిల్పై బయటికి వచ్చాడు. ఎల్బీనగర్లో ఈ కేసు విచారణ కొనసాగింది. డీఆర్ఐ అధికారులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించడంతో కోర్టు అన్నింటిని పరిశీలించింది. వాదోపవాదాలు ముగిసిన తర్వాత రాధాకృష్ణను దోషిగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
ఇవీ చదవండి:
ఘనంగా ఏఆర్ రెహ్మాన్ కుమార్తె పెళ్లి.. వరుడు ఎవరంటే?
విమానంలో ప్రయాణికుడి హల్చల్.. డోర్ ఓపెన్ చేసి రెక్కలపైకి వెళ్లి..